ఫోమోతో పెట్టుబడులు సరికాదు | FOMO vs Returns Why Kumar Mangalam Birla Warns Against AI Investments | Sakshi
Sakshi News home page

ఫోమోతో పెట్టుబడులు సరికాదు

Oct 14 2026 8:34 AM | Updated on Oct 14 2026 8:34 AM

FOMO vs Returns Why Kumar Mangalam Birla Warns Against AI Investments

రాబడుల ఆధారంగా ఏఐ ఇన్వెస్ట్‌మెంట్స్‌

రిటర్నుల ఆధారంగా మాత్రమే ఏఐలో పెట్టుబడులకు తెరతీయవలసి ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. అంతేగానీ బస్‌ మిస్సవుతామేమో అన్న భయం(ఫోమో)తో ఏఐను అందిపుచ్చుకోవాలని ప్రయత్నించరాదని పేర్కొన్నారు. ఏడాదిక్రితం వేసిన ప్రణాళికలను పక్కనపెట్టి బిర్లా గ్రూప్‌ క్రమంగా ఏఐ పెట్టుబడులను చేపట్టనున్నట్లు 2026 బ్లూమ్‌బెర్గ్‌ న్యూ ఎకానమీ సదస్సులో వెల్లడించారు.

ఫోమో కారణంగా ఏఐపై స్పందించలేమని, ఒక క్రమపద్ధతిలో మాత్రమే దీనిపై ముందుకు వెళ్లదలచినట్లు తెలియజేశారు. వివిధ బిజినెస్‌లకు అనుగుణంగా ఏఐ ఆధారిత అప్లికేషన్లు మారుతుంటాయని, కొన్ని విభాగాలలో టెక్నాలజీ కస్టమర్లతో మమేకమయ్యేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. మరికొన్నిచోట్ల తయారీ సామర్థ్యంలోనూ, ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో నికర వడ్డీ మార్జిన్ల మెరుగుకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రచ్చకెక్కిన టీవీఎస్ ఫ్యామిలీ వార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement