ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఇక నేరుగా లోన్లు.. | Flipkart secures NBFC licence from RBI, to begin lending from own books | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌ ఇక నేరుగా అ‍ప్పులిస్తుంది..

Jun 6 2025 4:15 PM | Updated on Jun 6 2025 4:31 PM

Flipkart secures NBFC licence from RBI, to begin lending from own books

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కి రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్సు లభించింది. ఈ ఏడాది మార్చిలో ఆర్‌బీఐ దీన్ని మంజూరు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్లిప్‌కార్ట్‌ దీన్ని ధ్రువీకరించినప్పటికీ, ఇతర వివరాలను వెల్లడించలేదు.

ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సు లభించడంతో ఇకపై కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్‌ నేరుగా రుణాలు అందించేందుకు వీలు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌కి ప్రస్తుతం 80 శాతం వాటాలు ఉన్నాయి. త్వరలో ఐపీవోకి వచ్చే యోచనలో ఉన్న ఫ్లిప్‌కార్ట్‌ తమ హోల్డింగ్‌ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్‌ నుంచి భారత్‌కు మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.

ఈ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సు ఫ్లిప్‌కార్ట్‌కు ఆర్థిక సేవల రంగంలో కొత్త అవకాశాలను తెరుస్తుంది. ముఖ్యంగా డిజిటల్ రుణాలు, క్రెడిట్ ఉత్పత్తులు, కస్టమర్ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు సౌలభ్యం కల్పిస్తుంది. భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఈ లైసెన్సు ఫ్లిప్‌కార్ట్‌కు పోటీలో ముందంజలో ఉండటానికి, వినియోగదారులకు సమగ్ర సేవలను అందించడానికి సహాయపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement