న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) మాల్దీవుల్లోనూ అందుబాటులోకి వచ్చింది. మాల్దీవులకు చెందిన ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టం ‘ఫావరా’ను, యూపీఐతో అనుసంధానించినట్లు ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్, మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ (ఎంఎంఏ) వెల్లడించాయి. దీనితో మాల్దీవుల్లోని వారు తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా భారత్‌లోని యూపీఐ ఆధారిత బ్యాంక్ అకౌంట్లకు రియల్ టైమ్‌లో నగదును బదిలీ చేయొచ్చు. ప్రస్తుతం కాంబోడియా, సింగపూర్ తదితర తొమ్మిది దేశాల్లో యూపీఐని వినియోగిస్తున్నారు.


