యాపిల్‌ రికార్డు ఆదాయం  | Apple posts record June quarter revenue in India | Sakshi
Sakshi News home page

యాపిల్‌ రికార్డు ఆదాయం 

Aug 1 2026 6:13 AM | Updated on Aug 1 2026 6:21 AM

Apple posts record June quarter revenue in India

జూన్‌ క్వార్టర్‌లో 109.4 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 109.4 బిలియన్‌ డాలర్ల ఆదాయం ప్రకటించింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే లాభం 16 శాతం పెరిగింది. భారత్‌ సహా పలు వర్ధమాన దేశాల్లో రెండంకెల స్థాయిలో అమ్మకాలు పెరగడం ఇందుకు దోహదపడ్డాయి. సంస్థ ఆదాయంలో అమెరికా వాటా అత్యధికంగా ఉండగా, గ్రేటర్‌ చైనాలో 22.42 శాతం, యూరప్‌ల 22.4 శాతం, రెస్ట్‌ ఆఫ్‌ ఆసియా పసిఫిక్‌లో 15.6 శాతం మేర వృద్ధి సాధించింది. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ హోదాలో చివరిసారిగా ఎరి్నంగ్స్‌ కాల్‌లో పాల్గొన్న టిమ్‌ కుక్‌ ఈ విషయాలు తెలిపారు.

 సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త సీఈవో జాన్‌ టెర్నస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు, మెమొరీ చిప్‌ల ధరలు పెరుగుతుండటం, సరఫరాపరమైన సవాళ్లు మొదలైనవి రాబోయే కొన్ని త్రైమాసికాల పాటు వ్యాపారానికి రిస్కులుగా ఉండవచ్చని కుక్‌ చెప్పారు. సమీక్షాకాలంలో ఐఫోన్ల అమ్మకాలు 22 శాతం పెరిగి 54.25 బిలియన్‌ డాలర్లకు, మ్యాక్‌ విక్రయాలు 29 శాతం వృద్ధితో 10.35 బిలియన్‌ డాలర్లకు, వేరబుల్స్‌ మొదలైన విభాగాలు 6 శాతం పెరిగి 7.9 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరినట్లు యాపిల్‌ సీఎఫ్‌వో కేవన్‌ పరేఖ్‌ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement