Eric Schmidt: ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ మాజీ సీఈఓ..

Ex google ceo eric Schmidt says AI technology can kill people - Sakshi

ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాయి. అయితే ఈ 'ఏఐ' టెక్నాలజీ మానవాళికి ముప్పు తీసుకువస్తుందని గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ స్మిత్ హెచ్చరించారు. తప్పకుండా దీనిని నియంత్రించాలి. లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

ఇటీవల వార్డ్రోట్ జర్నల్ సీఈవో కౌన్సిల్ సమావేశంలో ఎరిక్ స్మిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎంతో మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి హెచ్చరించారు. సరైన మార్గంలో ఉపయోగించుకునేంత వరకు దీని వల్ల ఎటువంటి ప్రమాదం లేదని, ఒక్కసారి అనవసర విషయాల్లో ఉపయోగించడం మొదలుపెడితే అది చాలా ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అణు సాంకేతిక‌త‌తో సమానమని, ఒక స్థాయిలో దానిని కంట్రోల్ చేయడం చాలా కష్టమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ సంస్థలైన ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్ అధినేతలతో పాటు బ్రిటన్ ప్రధాని పాల్గొన్న ఈ సమావేశంలో ఎరిక్ ఈ వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం. ఎరిక్ స్మిత్ గూగుల్ సంస్థకు 2001 నుంచి 2011 వరకు సీఈఓగా పనిచేసి, ఆ తరువాత 2015 నుంచి 2017 వరకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

(ఇదీ చదవండి: ఆధునిక ప్రపంచంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' ఈ పనులను చేస్తుందా? ఆ పరిణామాలెలా ఉంటాయి!)

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో తప్పకుండా దుష్ప్రభావాలను కలిగించే అవకాశం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో పాటు ఇతర టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ సాంకేతికత వల్ల భవిష్యత్తులో కలిగే దుష్ప్రభావాలను తలచుకుంటే నిద్ర రావడం లేదని పిచాయ్ అన్నాడు. బిల్ గేట్స్ కూడా దీనినే అంగీకరించాడు. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ఎలాంటి దుష్ప్రభావాలను కలిగిస్తుందనేది అంతు చిక్కని ప్రశ్న.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top