Artificial Intelligence: ఆధునిక ప్రపంచంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' ఈ పనులను చేస్తుందా? ఆ పరిణామాలెలా ఉంటాయి!

How Artificial Intelligence Impact the Future of Work - Sakshi

Artificial Intelligence: ప్రపంచం అభివృద్దివైపు దూసుకెళ్తోంది.. టెక్నాలజీ అంతకు మించిన వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఈ రోజు మనిషి చేసే దాదాపు అన్ని పనులు యంత్రాలు చేయగలుగుతున్నాయి, చేయగలిగేలా తయారు చేస్తున్నారు. మనిషి చేయగల ఏ పనినైనా మిషన్స్ మరో 20 సంవత్సరాల్లో చేస్తాయని 1965లోనే సైంటిస్ట్ & నోబెల్ గ్రహీత 'హెర్బర్ట్ సైమన్' అన్నాడు. నేడు అదే పరిస్థితి మొదలైందా అని తలపిస్తోంది. 

వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, మిలటరీ రంగం వరకు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇది ఈ రంగాల్లో సానుకూల ప్రభావం చూపుతుందా? లేదా చీకటి భవిష్యత్తులోకి తీసుకెళుతుందా అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఆరోగ్య సంరక్షణ
గతంలో వైద్య సంరక్షణలో మనుషుల పాత్ర ఎక్కువగా ఉండేది. ఏదైనా ఆపరేషన్ వంటివి చేయాలంటే ఎక్కువ మంది అవసరం పడేది. అయితే ఈ రోజుల్లో MRI స్కాన్స్, X-రేస్ వంటి వాటితో ఎక్కడ ప్రమాదముంది అని ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇవన్నీ వైద్యరంగాన్ని మరింత సులభతరం చేశాయి. స్మార్ట్‌ఫోన్ ద్వారా డిమెన్షియా నిర్ధారణపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని యాప్స్ మనిషి రోజు వారీ కదలికలను కూడా చెప్పేస్తున్నాయి. అయితే ఒక రోగిని ఒక గది నుంచి మరో గదికి తరలించాలంటే ఖచ్చితంగా మనిషి అవసరం ఉంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. మానవ ప్రమేయం లేకుండా అనుకున్న విజయం సాధించే అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లాగిన్ చేయవచ్చు, రోగికి సంబంధించిన రోగాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఆ తరువాత దాన్ని ఒక వైద్యుడే పూర్తి చేయాలి. మనిషి ప్రమేయం లేకుండా AI మాత్రమే ఏమి సాధించలేదు. అదే సమయంలో మనిషి చేయాల్సిన పని మరింత వేగవంతం కావడానికి 'ఏఐ' చాలా ఉపయోగపడుతుంది.

విద్య
ఇప్పటికే అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో బోధించడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఒక ప్రొఫెసర్ చెప్పే క్లాస్ ఆటోమేషన్ చెబితే భిన్నంగా ఉంటుంది. తరగతిలో సమయాన్ని బట్టి ఏది ఎలా చెప్పాలో ఒక గురువు మాత్రమే నిర్ణయిస్తాడు. కానీ ఆటోమేషన్ తనకు ఇచ్చిన క్లాస్ పూర్తి చేసి వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఉపయోగించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మనిషి భావాన్ని, భావోద్వేగాన్ని గ్రహించదు. కావున విద్యార్థులతో పరస్పర సంబంధం కోల్పోతుంది. ఆ సంబంధం కేవలం గురువు మాత్రమే పొందగలడు.

కాల్ సెంటర్లు
కాల్ సెంటర్లలో మాత్రమే AI తప్పకుండా చాలా ఉపయోగకరమైనదనే చెప్పాలి. ఎందుకంటే కాల్ సెంటర్‌లు తరచుగా ఒత్తిడితో నిండిన వాతావరణం కలిగి ఉంటాయి. ఇది అక్కడ పనిచేసేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ స్థానంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది వాయిస్-టోన్ గుర్తింపును ఉపయోగించి సిబ్బంది, నిర్వాహకులు తమ కస్టమర్‌లు, కార్మికుల భావోద్వేగ స్థితిని అంచనా వేయడానికి అనుమతిస్తుంది.

(ఇదీ చదవండి: చాలా గర్వంగా ఉంది.. కాబోయే భార్య గురించి ట్వీట్ చేసిన జే కోటక్ - వైరల్ అవుతున్న పోస్ట్)

వ్యవసాయం
ప్రస్తుతం ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వ్యవసాయ రంగంలో కూడా ఆటోమేషన్‌ రాజయమేలుతున్నాయి. క్లైమేట్ ఫోర్‌కాస్టింగ్ అండ్ తెగుళ్లు, వ్యాధి నిరోధకతలో AI ఉపయోగపడుతున్నాయి. అంతే కాకుండా ఇందులో రోబోటిక్స్‌ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. నిజానికి ఏ పనైనా చేయడానికి ఉపయోగపడే ఈ టెక్నాలజీ కొన్ని సందర్భాల్లో ఉపయోగపడవు. ఏ ట్రక్కు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రక్కులో ఏమి నింపాలి అనే విషయాలు అది అర్థం చేసుకున్నప్పటికీ మానవ ప్రమేయం లేకుండా ఇది మాత్రమే ఏమి చేయలేదు. ఆలా జరిగితే తప్పకుండా ప్రమాదాలు సంభవిస్తాయి. 

(ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?)

మిలటరీ
ఇక చివరగా మిలటరీ విభాగం విషయానికి వస్తే, AIలో సైనిక పెట్టుబడులు ఇప్పటికే చాలా పెట్టినట్లు తెలుస్తోంది. ఇది యుద్ధ భవిష్యత్తును నడిపిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. కానీ సెమీ అటానమస్ డ్రోన్‌లు, ట్యాంకులు, జలాంతర్గాములను ప్రవేశపెట్టినప్పటికీ, సాంకేతికత ఊహించిన దాని కంటే తక్కువగా ఉపయోగపడుతుంది. యుద్ధం వంటి వాటిలో ఈ టెక్నాలజీ అంతగా ఉపయోగపడకపోవచ్చు. ధైర్యం, దయ, కరుణ వంటి లక్షణాలు కేవలం సైనికులకు మాత్రమే ఉంటాయి. AI టెక్నాలజీకి అలాటివి ఉండవు. అయితే దీనివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. యుద్ధంలో మరణించే సైనికుల సంఖ్యను తగ్గిస్తుంది. భవిష్యత్తులో మనిషి ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ముందుకు వెళతాడు అనేది సమ్మతించాల్సిన విషయమే.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top