బుల్లి మస్క్‌ భలే ఉన్నాడే.. ఏఐ చిత్రానికి మస్క్‌ ఫిదా! వైరల్‌ ట్వీట్‌ | elon musk ai generated photo as a small boy | Sakshi
Sakshi News home page

బుల్లి మస్క్‌ భలే ఉన్నాడే.. ఏఐ చిత్రానికి మస్క్‌ ఫిదా! వైరల్‌ ట్వీట్‌

Jun 4 2023 7:34 PM | Updated on Jun 4 2023 7:35 PM

elon musk ai generated photo as a small boy - Sakshi

ట్విటర్‌ బాస్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ చిన్న పిల్లాడిలా మారిపోయారు. ఏంటి మస్క్‌ ఏమైనా టైమ్‌ ట్రావెల్‌ చేస్తున్నాడా అని అనుకోవద్దు. అదేం లేదు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఎలాన్‌ మస్క్‌ చిత్రాలను రోజుకోరకంగా మారుస్తున్నారు. 

ఆర్టిఫీషియల్‌  ఇంటెలిజెన్స్‌తో చిన్న పిల్లాడిలా రూపొందించిన మస్క్ చిత్రాన్ని ఓ ట్విటర్‌ యూజర్‌ షేర్‌ చేశారు. ‘బ్రేకింగ్: ఎలాన్ మస్క్ యాంటీ ఏజింగ్ ఫార్ములాపై పని చేస్తున్నాడు’ అంటూ దీనికి టైటిల్‌ పెట్టాడు. వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా వీవ్స్‌ వచ్చాయి. 45 వేల మందికిపైగా లైక్‌ చేశారు.

ఎలాన్‌ మస్క్‌పై ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఫోటో రోజుకొకటి ఇంటర్నెట్‌లో  హల్‌చల్‌ చేస్తోంది. వీటికి మస్క్‌ సైతం అంతే వైవిధ్యంగా స్పందిస్తున్నారు.

ఇదీ చదవండి: పెళ్లికొడుకు లుక్‌లో జబర్‌దస్త్‌గా..మస్క్‌: ఫోటోలు వైరల్‌ 

Advertisement
 
Advertisement
Advertisement