
టెక్నాలజీ పెరుగుతోంది, ప్రతి అంశంలో పురోగతి కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే అందరూ వాట్సాప్ వినియోగిస్తున్నారు. కానీ చాలామందికి చాట్‌జీపీటీతో చాట్ చేయడం, వాయిస్ మెసేజ్‌ను టెక్స్ట్ రూపంలోకి ఎలా మార్చాలి?, వీడియో కాల్స్‌కు ఫన్ యాడ్ చేయడం వంటివి తెలియదు. ఈ కథనంలో అలాంటి ఆసక్తికరమైన వాట్సాప్ టిప్స్ గురించి తెలుసుకుందాం.
చాట్‌జీపీటీతో చాటింగ్
ఏఐ అందుబాటులోకి వచ్చిన తరువాత చాట్‌జీపీటీతో చాటింగ్ చేయడం సాధ్యమవుతోంది. మీరు దీనికోసం చేయాల్సిందల్లా.. చాట్‌జీపీటీ యొక్క ప్రత్యేక నంబర్‌ను యాడ్ చేసుకోవడమే. ఇలా చేస్తే మీరు వాట్సాప్‌లోనే చాటింగ్ చేయవచ్చు. ప్రశ్నలు అడగడం వంటివి చేయవచ్చు. దీనిని ఒక తెలివైన ఫ్రెండ్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు.
వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపం
ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ లభిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు మీకు వచ్చిన వాయిస్ మెసేజ్ వినడానికి ఇబ్బందిపడే సమయంలో.. ఈ ఫీచర్ వచ్చిన సందేశాన్ని టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. అప్పుడు వచ్చిన విషయాన్ని చదివి తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.
వీడియో కాల్‌లకు ఫన్ యాడ్
వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో.. మీ ముఖం విసుగ్గా అనిపించినప్పుడు.. మ్యాజిక్ వాండ్ ఐకాన్ ద్వారా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ ట్వీక్‌లు లేదా ఫిల్టర్‌లను ఉపయోగించి కొంత ఆనందపడొచ్చు. ఇది సరదాగా కూడా ఉంటుంది.
ఈ మెయిల్ లేదా పాస్‌కీతో లాగిన్
ఎస్ఎమ్ఎస్ కోడ్ పనిచేయనప్పుడు.. మీరు ఈమెయిల్‌ను లింక్ చేసి వెరిఫికేషన్ కోడ్స్ స్వీకరించవచ్చు. అంతే కాకుండా.. భవిష్యత్ లాగిన్‌ల కోసం పాస్‌కీని సెట్ చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ చేసిన తరువాత కోడ్‌లను టైప్ చేయడానికి బదులుగా బయోమెట్రిక్ సాయంతో సైన్ ఇన్ చేసుకోవచ్చు.
ఒక వాట్సాప్.. మల్టిపుల్ ఫోన్లలో
ఒక నెంబరుకు ఒక వాట్సాప్ ఉంటుంది. రెండు లేదా మూడు మొబైల్ ఫోన్లలో ఒకే వాట్సాప్ లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు లేదా ఉపయోగించాలనుకున్నప్పుడు.. మీ మొదటి ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. రెండవ మొబైల్ ఫోనులో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వర్క్ లైఫ్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ''వన్ అకౌంట్ - మల్టిపుల్ స్మార్ట్‌ఫోన్స్'' అన్నమాట.
ప్రైవేట్ సంభాషణలను లాక్
మీరు చేసే చాటింగ్ రహస్యంగా ఉంచాలంటే.. లాక్ చేసుకోవచ్చు. దీనికి మీరు పేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా బయోమెట్రిక్ వంటివి ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా.. మీ అనుమతి లేకుండా ఎవరూ మీ చాటింగ్ చూడలేరు.
పర్సనల్ నోట్‌బుక్‌గా వాట్సాప్
మీకు అవసరమైన విషయాన్ని సేవ్ చేసుకోవడానికి లేదా మర్చిపోకుండా ఉండటానికి పర్సనల్ నోట్‌బుక్‌గా వాట్సాప్ పనిచేస్తుంది. అంటే 'మై సెల్ఫ్' అన్నట్టు.. మీకు మీరే విషయాలను మెసేజ్ చేసుకోవచ్చు. వాటిని మళ్ళీ అవసరమైనప్పుడు చదువుకోవచ్చు.
ఇలాంటి టిప్స్ ఉపయోగించడం వల్ల వినియోగదారులకు సరదాగా ఉంటుంది. అంతే కాకుండా మీకు మీరే వాట్సప్‌ను ఉపయోగకరంగా కూడా మార్చుకోవచ్చు. మొత్తం మీద వాట్సప్‌ను సరదాగా ఉండే కమ్యూనికేషన్ హబ్‌గా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉందనే విషయం మాత్రమే మర్చిపోవచ్చు.