Elon Musk And Zuckerberg AI Pics Viral On Twitter - Sakshi
Sakshi News home page

AI: బీచ్‌లో చిల్‌ అవుతున్న మస్క్‌, జుకర్‌బర్గ్‌.. ఏంటి, కలిసిపోయారా?

Jul 17 2023 11:27 AM | Updated on Jul 17 2023 12:41 PM

Elon musk and zuckerbergs Ai pics viral in twitter  - Sakshi

ట్విటర్ బాస్ 'ఎలాన్ మస్క్' & మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్‌బర్గ్' మధ్య ఉన్న పోటీ గురించి దాదాపు అందరికి తెలుసు. ఈ ఇద్దరూ కేజ్ ఫైట్‌కు సిద్దమవుతున్నట్లు గత కొన్ని రోజులకు ముందు సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడు వీరిరువురూ కలిసిపోయినట్లు కనిపించే ఫోటో వైరల్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, ఎలాన్ మస్క్ అండ్ జుకర్‌బర్గ్ కలిసిపోయినట్లు కనిపించే ఈ ఫోటో 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' (AI) రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇద్దరూ చేతులు పట్టుకుని టైటాన్‌లు బీచ్‌లో నడుస్తున్నట్లు కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: భారత్‌లో ఈ కార్లకు డిమాండ్ ఎక్కువ - వీటి ప్రత్యేకతేంటంటే?)

సర్ డోజ్ ఆఫ్ ది కాయిన్‌తో అనే ఒక ట్విటర్ యూజర్ ఏఐ ద్వారా ఈ చిత్రాలను రూపోంచినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరి చేయి మరొకరు పట్టుకున్నట్లు, కౌగిలించుకున్నట్లు, బీచ్‌లో ఎంజాయ్ చేతున్నట్లు చూడవచ్చు. ఇప్పటికి ఈ ఫొటోలు మిలియన్ల మంది వీక్షించారు. లక్షల మంచి లైక్ చేశారు. దీనిపై స్పందించిన మస్క్ ఒక నవ్వుతున్న ఎమోజి ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు. మొత్తం మీద ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement