పెళ్లికొడుకు లుక్‌లో జబర్‌దస్త్‌గా..మస్క్‌: ఫోటోలు వైరల్‌

AI Transformed pics Indian Groom as Elon Musk going viral - Sakshi

 భారతీయ వరుడి గెటప్‌లో మురిసి పోతున్న ఎలాన్‌ మస్క్‌ 

న్యూఢిల్లీ: ట్విటర్ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ కొత్త పెళ్లి కొడుకు ఫోజులో మెరిసిపోతున్నాడు. షేర్వాణీలో, గుర్రపు స్వారీ చేస్తూ, అతిథులతో డ్యాన్స్‌ చేస్తున్న మస్క్‌ డిఫరెంట్‌ లుక్‌లో అదిరిపోతున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.  ఆగండి ఆగండి ..మస్క్‌ మళ్లీ పెళ్లి అంటూ ఏవేవో  ఊహించేసుకోకండి.. ఇదంతా ఏఐ ఆర్ట్‌మాయ.

రోలింగ్ కాన్వాస్ ప్రెజెంటేషన్స్ అనే హ్యాండిల్‌ తన  ఇన్‌స్టాగ్రామ్‌లో  మస్క్‌ పోటోలను షేర్‌  చేసింది.  అలాగే  వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్‌, ఏఐ ఆర్టిస్ట్‌ కూడా నాలుగు రోజులు క్రితం ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ పిక్స్‌ చివరికి మస్క్‌ దాకా  చేరాయి. దీంతో ఐ లవ్‌ ఇట్‌  అంటూ మస్క్‌ మురిసిపోవడం విశేషం.  (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యలు)

కాగా ప్రపంచకుబేరుడు టైటిల్‌ను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మళ్లీ దక్కించుకున్నాడు. ఎలోన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తి టైటిల్‌ను తిరిగి పొందాడు. ప్యారిస్ ట్రేడింగ్‌లో ఆర్నాల్ట్   షేర్ల  2.6 శాతం పతనం  కావడంతో  లగ్జరీ టైకూన్ బెర్నార్డ్  ఆర్నాల్ట్‌ను అధిగమించిన  మస్క్‌ టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. (వారెవ్వా ఓనరు..ఫిదా చేశావ్‌ గురూ! ఏం చేశాడో తెలిస్తే!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top