ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న ‘గార్బేజ్‌ క్వీన్స్‌’ : వైరల్‌ ఫోటోలు

AI Generated Images of sahid garbage queens Going Viral - Sakshi

 సాక్షి,ముంబై:  ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆర్ట్ ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. ఎస్‌కే ఎండీ అబు సాహిద్ అనే అర్టిస్ట్ మిడ్‌జర్నీ ఏఐ టూల్‌తో సృజనాత్మక చిత్రాలు పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా గార్బేజ్‌ క్వీన్స్‌ పేరుతో  కొన్ని అద్భుతమైన చిత్రాలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.భయంకరమైన చెత్తలో అందమైన మోడల్స్‌ను సృష్టించిడం ఈ సిరీస్‌ ప్రత్యేకత. (సింపుల్‌ వన్‌: లాంగెస్ట్‌ రేంజ్‌ స్కూటర్‌ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?)

కాగా ఏఐ ఆర్ట్‌తో  సునామీ సృష్టిస్తున్న సాహిద్‌ ఇప్పటికే పలు పిక్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రముఖ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వృద్ధాప్యంలో, స్థూలకాయులుగా మారిపోతే ఎలాంటి ఉంటారనే చిత్రాలను పోస్ట్‌ చేశారు. అలాగే బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌ ముసలివాళ్లుగా ఎలా ఉంటారు?  బిజినెస్‌ టైకూన్స్‌ జిమ్‌లో ఎలా ఉంటారనే ఊహకు ప్రాణం పోస్తూ మరికొన్ని పిక్స్‌ను షేర్‌ చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇలాంటి ఆసక్తికరమైన, ఊహాజనిత చిత్రాలు చాలానే చూడొచ్చు సాహిద్‌ ఇన్‌స్టాలో.  

ఇదీ చదవండి: వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్‌, అందంగా సల్మాన్‌ ఖాన్‌

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top