భవిష్యత్తు వారిదే.. CRED ఫౌండర్ సంచలన వ్యాఖ్యలు! | CRED Founder Kunal Shah Compares Human Minds To Computer Processors Know The Details | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు వారిదే.. CRED ఫౌండర్ సంచలన వ్యాఖ్యలు!

Nov 16 2026 7:13 AM | Updated on Nov 16 2026 7:23 AM

CRED Founder Kunal Shah Compares Human Minds To Computer Processors Know The Details

టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది.. ముఖ్యంగా ఏఐ రాకతో మనుషులు పనిచేసే విధానం కూడా పూర్తిగా మారిపోతోంది. ఇలాంటి సమయంలో మనం ఎంత చదువుకున్నాం, ఎన్ని మార్కులు సాధించాం.. అనే దానికంటే, ఎంత భిన్నంగా ఆలోచించగలుగుతున్నాం అనేది చాలా ప్రధానం. ఈ విషయాన్ని క్రెడ్ ఫౌండర్ కునాల్ షా వివరించారు.

కునాల్ షా మనుషుల ఆలోచనా విధానాన్ని.. కంప్యూటర్‌లో ఉండే సీపీయూ, జీపీయూలతో పోల్చారు. సాధారణంగా.. సీపీయూ ఒక పనిని, ఒక క్రమంలో పూర్తి చేస్తూ ముందుకు వెళ్తుంది. కొంతమంది మనుషులు కూడా ఇదే విధానాన్ని అనుస్తున్నారా? అన్నట్లు.. ఒక పనిమీద దృష్టి పెట్టి, దాన్ని పూర్తి చేసిన తర్వాత మరో పనిని ప్రారంభిస్తారు. ప్రస్తుత విద్యావ్యవస్థలు కూడా ఈ విధానాన్నే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. ఉదాహరణకు.. పాఠాలు చదవడం, పరీక్షలు రాయడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, చెప్పిన పనిని చెప్పిన విధంగా చేయడం వంటివన్నమాట.

ఇక జీపీయూ విషయానికి వస్తే.. ఇది ఒకేసారి అనేక పనులను ప్రాసెస్ చేయగలదు. అదే విధంగా కొంతమంది వ్యక్తులు కూడా ఒక విషయాన్ని ఒక కోణంలో కాకుండా.. అనేక కోణాల్లో ఆలోచిస్తారు. రెండు సంబంధం లేని విషయాల మధ్య కూడా సంబంధాన్ని గుర్తించగలుగుతారు. సమస్యకు అందరూ ఆలోచించని విధంగా పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు.

ఇప్పటివరకు మన విద్యావ్యవస్థ సీపీయూ ఆలోచనా విధానం ఉన్నవారిని ఎక్కువగా ప్రోత్సహించింది. కానీ భవిష్యత్తులో జీపీయూ లాంటి ఆలోచనా విధానం ఉన్నవారికి ఎక్కువ విలువ ఉంటుందని కునాల్ షా చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఊహకందని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు!

కునాల్ షా ఏడీహెచ్‌డీ (Attention-Deficit/Hyperactivity Disorder) గురించి ప్రస్తావించారు. ఏడీహెచ్‌డీ ఉన్న కొంతమందికి ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టడం లేదా పనులను ఒక క్రమంలో నిర్వహించడం కష్టంగా ఉండవచ్చు. అయితే.. వారి అనుభవాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో సృజనాత్మకత, కొత్త ఆలోచనలు చేయడం, విభిన్న విషయాలను అనుసంధానం చేయడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇలాంటి వారే భవిష్యత్తులో ప్రపంచానికి అవసరమయ్యే కొన్ని రకాల ఆలోచనలు చేస్తారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement