ఊహకందని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు! | Gold and Silver Prices Crash in India Biggest Weekly Drop from November 8 to 14 | Sakshi
Sakshi News home page

ఊహకందని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు!

Nov 15 2026 1:42 PM | Updated on Nov 15 2026 1:56 PM

Gold and Silver Prices Crash in India Biggest Weekly Drop from November 8 to 14

భారతదేశంలో బంగారం ధరలు.. వారంరోజుల్లో (నవంబర్ 8 నుంచి 14 వరకు) గణనీయంగా తగ్గాయి. దీంతో గత ఆదివారం రూ.1,43,570 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు.. శనివారం నాటికి రూ.1,37,620 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే కేవలం ఏడురోజుల్లో పసిడి ధరల్లో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్, విజయవాడలలో నవంబర్ 8న రూ.1,43,570 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు.. 14 నాటికి రూ.1,37,620 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల్లో రూ.5950 తగ్గిందన్నమాట. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,31,600 నుంచి రూ.1,26,150 వద్దకు (రూ.5450 తగ్గింది) చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.

చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు భారీగా తగ్గిందని స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 1,43,570 రూపాయల నుంచి రూ.1,37,620 వద్దకు (రూ.5950 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,31,600 నుంచి రూ.1,26,150 వద్దకు (రూ.5450 తగ్గింది) చేరింది.

ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 1,43,600 రూపాయల నుంచి రూ.1,37,770 వద్దకు (రూ.5830 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,31,750 నుంచి రూ.1,26,300 వద్దకు (రూ.5450 తగ్గింది) చేరింది.

ఇదీ చదవండి: CNG వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన ధరలు!

వెండి రేటు
బంగారం మాత్రమే కాకుండా.. వెండి రేటు కూడా గణనీయంగా తగ్గింది. నవంబర్ 8న రూ.2.05 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు నవంబర్ 14 నాటికి రూ.1.95 లక్షల వద్దకు చేరింది. అంటే వారంరోజుల్లో వెండి రేటు రూ.10వేలు తగ్గింది. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ కేజీ వెండి ధర రూ.1,95,000 వద్ద ఉంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ రోజు (ఆదివారం) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడవచ్చు.

బంగారం, వెండి ధరలు1
1/6

బంగారం, వెండి ధరలు2
2/6

బంగారం, వెండి ధరలు3
3/6

బంగారం, వెండి ధరలు4
4/6

బంగారం, వెండి ధరలు5
5/6

బంగారం, వెండి ధరలు6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement