కేవలం రూ.1000తో కంప్యూటర్ సేవలు.. JioPC ప్లాన్స్ ఇవే! | JioPC Brings a Computer Within Reach of Students Schools Colleges and Skilling Centres | Sakshi
Sakshi News home page

కేవలం రూ.1000తో కంప్యూటర్ సేవలు.. JioPC ప్లాన్స్ ఇవే!

Oct 12 2026 8:36 PM | Updated on Oct 12 2026 8:48 PM

JioPC Brings a Computer Within Reach of Students Schools Colleges and Skilling Centres

రిలయన్స్ జియో.. విద్యార్థులు, స్కూళ్లు, కాలేజీలకు ఉపయోగపడేలా జియోపీసీ (JioPC) పేరుతో కొత్త క్లౌడ్ కంప్యూటింగ్ సేవను అందిస్తోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. కొత్త కంప్యూటర్ కొనుగోలు చేయకుండానే, ఇప్పటికే ఉన్న ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా మానిటర్‌ను ఉపయోగించి కంప్యూటింగ్ సదుపాయాలను పొందవచ్చు.

జియో సెట్‌టాప్ బాక్స్ లేదా వెబ్ బ్రౌజర్ ద్వారా కూడా ఈ సేవను యాక్సెస్ చేయవచ్చు. అంతేకాదు.. యాక్టివ్ జియోపీసీ సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఇతర ఇంటర్నెట్ కనెక్షన్ల ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు.

➤జియోపీసీలో రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి.
➤8జీబీ ర్యామ్, 500జీబీ స్టోరేజ్‌తో కూడిన ప్లాన్ రెండు నెలలకు రూ.1,000, ఐదు నెలలకు రూ.2,000, 10+2 నెలలకు రూ.4,000గా ఉంది.
➤16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్‌తో కూడిన జియోపీసీ అల్ట్రా ప్లాన్ రెండు నెలలకు రూ.1,200, ఐదు నెలలకు రూ.2,500, 10+2 నెలలకు రూ.5,000గా అందుబాటులో ఉంది. 
➤ఈ సబ్‌స్క్రిప్షన్ విధానం వల్ల కొత్త కంప్యూటర్ కొనడానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం తగ్గుతుంది.

విద్యార్థులు ఈ సేవ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు, అసైన్‌మెంట్లు, కోడింగ్, డిజైన్, రీసెర్చ్ వంటి పనులు చేసుకోవచ్చు. అలాగే.. ఏఐ టూల్స్, విద్యా సంబంధిత అప్లికేషన్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలు కూడా పాత కంప్యూటర్లను పూర్తిగా మార్చకుండా.. వాటి ద్వారా మెరుగైన కంప్యూటింగ్ సదుపాయాలను అందించవచ్చు. దీంతో విద్యా సంస్థలకు హార్డ్‌వేర్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది.

జియోపీసీలో ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్‌ఫేస్‌తో పాటు లిబ్రెఆఫీస్, వెబ్ బ్రౌజర్లు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రెజెంటేషన్లు తయారు చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ 365 వంటి ఆన్‌లైన్ సేవలు, అడోబ్ ఎక్స్‌ప్రెస్ వంటి టూల్స్‌ను కూడా బ్రౌజర్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. అయితే.. కొన్ని అప్లికేషన్లకు అదనపు సబ్‌స్క్రిప్షన్ అవసరం కావచ్చు. ఈ సేవలో డేటాను క్లౌడ్‌లో భద్రపరుస్తారు కాబట్టి, కంప్యూటర్ లేదా సెట్‌టాప్ బాక్స్ పాడైనా నిల్వ చేసిన డేటా సురక్షితంగా ఉండేలా సదుపాయాలు కల్పించినట్లు జియో తెలిపింది.

మరోవైపు.. అర్హత కలిగిన జియోహోమ్ కస్టమర్లు నెలకు రూ.100 విలువైన వోచర్‌ను బ్రాడ్‌బ్యాండ్ బిల్లుపై వినియోగించుకోవచ్చు. అయితే, జియోపీసీ పూర్తిగా ఇంటర్నెట్‌పై ఆధారపడే సేవ కాబట్టి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. కొత్త కంప్యూటర్ కొనడానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవాలనుకునే విద్యార్థులు, కుటుంబాలు, విద్యా సంస్థలకు ఇది ఉపయోగకరమైన ప్రత్యామ్నాయంగా ఉండొచ్చు. అయితే, సబ్‌స్క్రిప్షన్ ఖర్చు, అవసరమైన పరికరాలు, ఉపయోగించాలనుకునే సాఫ్ట్‌వేర్‌లను బట్టి ఈ సేవ తమకు ఎంతవరకు సరిపోతుందో నిర్ణయించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement