
యువతకు 5జీ తదితర టెక్నాలజీల్లో శిక్షణ
యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించే దిశగా నాలుగు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలతో ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ చేతులు కలిపింది. కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా సమక్షంలో ఎరిక్సన్ ఇండియా, క్వాల్‌కామ్ టెక్నాలజీస్, సిస్కో సిస్టమ్స్, నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్‌వర్క్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇదీ చదవండి: కోనసీమలో ఓఎన్‌జీసీ గ్యాస్ సెంటర్
5జీ, ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, నెట్‌వర్కింగ్ తదితర టెక్నా లజీలకు సంబంధించిన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. జబల్‌పూర్‌లోని భారతరత్న భీమ్‌రావ్ అంబేడ్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికం ట్రైనింగ్‌లో ఈ కోర్సుల్లో శిక్షణనిస్తారు. తొలి దశలో రూ.1 కోటికి పైగా పెట్టుబడితో ఏటా 2,000 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సింధియా తెలిపారు. కాగా, భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించి, భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని నోకియా ఇండియా కంట్రీ మేనేజర్ తరుణ్ ఛాబ్రా తెలిపారు.