
ఆఫ్‌షోర్ పైప్‌లైన్, ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటు
రూ.4,606 కోట్ల పెట్టుబడులకు రెడీ
ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) తాజాగా రూ. 4,606 కోట్లకుపైగా పెట్టుబడులకు తెరతీయనుంది. తద్వారా 10 చమురు, గ్యాస్ బావుల అభివృద్ధి, రెండు మానవరహిత ప్లాట్‌ఫామ్స్, ఆఫ్‌షోర్ పైప్‌లైన్ ఏర్పాటుతోపాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో ఆన్‌షోర్ గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ప్రతిపాదిత ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం పర్యావరణం, అటవీ శాఖను సంప్రదించింది.
ఇదీ చదవండి: హాస్టల్ ఫీజు చెల్లిస్తున్నారా?
ఈ శాఖకు చెందిన నిపుణుల అప్రైజల్ కమిటీ(ఈఏసీ) జులై 24న సంబంధిత సమావేశం జరిగినట్లు వెల్లడించింది. ప్రతిపాదిత ఇన్‌స్టాలేషన్‌కు ఓడలరేవు టెర్మినల్‌లో మొత్తం 26.3 హెక్టార్లు అవసరమని తెలియజేసింది. 8.7 హెక్టార్లలో గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. మొత్తం ప్రాజెక్టుకు రూ.4,606 కోట్లకుపైగా వ్యయంకానున్నట్లు వివరించింది.