25 షేర్లలో నేటి నుంచి కొత్త సెటిల్‌మెంట్‌.. టీప్లస్‌జీరో | BSE announces 25 stocks eligible for Tplus 0 settlement cycle from 28 march 2024 | Sakshi
Sakshi News home page

25 షేర్లలో నేటి నుంచి కొత్త సెటిల్‌మెంట్‌.. టీప్లస్‌జీరో

Mar 28 2024 5:22 AM | Updated on Mar 28 2024 5:22 AM

BSE announces 25 stocks eligible for Tplus 0 settlement cycle from 28 march 2024 - Sakshi

స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నేటి(గురువారం) నుంచి టీప్లస్‌జీరో సెటిల్‌మెంట్‌కు తెరతీస్తున్నాయి. తొలుత 25 షేర్లలో ఆప్షనల్‌ పద్ధతిన అమలు చేయనున్నాయి. ఈక్విటీ నగదు మార్కెట్లో ప్రస్తుతం అమలవుతున్న టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌కు జతగా పరిశీలన పద్ధతిలో టీప్లస్‌0కు శ్రీకారం చుడుతున్నాయి. కొద్దిమంది బ్రోకర్ల ద్వారా మాత్రమే ఇందుకు వీలు కలి్పస్తున్నాయి. వెరసి ఈ నెల 28 నుంచి లావాదేవీ చేపట్టిన రోజునే సెటిల్‌మెంట్‌ పూర్తికానుంది.

ఈ జాబితాలో బజాజ్‌ ఆటో, వేదాంతా, హిందాల్కో, ఎస్‌బీఐ, ట్రెంట్, టాటా కమ్యూనికేషన్స్, నెస్లే, సిప్లా, ఎంఆర్‌ఎఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, ఎన్‌ఎండీసీ, అంబుజా సిమెంట్స్‌ తదితరాలున్నాయి. తాజా సెటిల్‌మెంట్‌తో సమయం, వ్యయాలు ఆదా అవుతాయని అంచనా. మార్కెట్‌ లావాదేవీల్లో ఈ వ్యవస్థ మరింత పారదర్శకత తీసుకువస్తుందని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement