విమానం క్రాష్‌ దెబ్బకు బోయింగ్‌ షేర్లూ క్రాష్‌ | Boeing shares crash over 7pc in pre market trading after Air India flight crash | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానం క్రాష్‌ దెబ్బకు బోయింగ్‌ షేర్లూ క్రాష్‌

Jun 12 2025 6:34 PM | Updated on Jun 12 2025 7:18 PM

Boeing shares crash over 7pc in pre market trading after Air India flight crash

ఎయిరిండియా విమానం క్రాష్‌ దెబ్బకు బోయింగ్‌ షేర్లు కూడా కుప్పకూలాయి. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో గురువారం ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో బోయింగ్ కంపెనీ షేర్లు 7 శాతానికి పైగా పతనమయ్యాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘానీనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం బోయింగ్ విమానాల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది.

ఏఐ-171 అనే విమానం లండన్ గాట్విక్‌కు బయలుదేరింది. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, ముగ్గురు చిన్న పిల్లలు సహా 242 మంది ఉన్నారు. రన్ వే 23 నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్ పోర్టు వెలుపల కూలిపోవడంతో దట్టమైన నల్లటి పొగలు గాల్లోకి ఎగిసిపడ్డాయి. కాగా విమానంలోని ప్రయాణికులందరూ చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి.

బోయింగ్ 737 మ్యాక్స్, 787 మోడళ్లకు సంబంధించిన ఇటీవలి భద్రతా సమస్యల కారణంగా కంపెనీ ఇప్పటికే రెగ్యులేటరీ, పెట్టుబడిదారుల ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ సంఘటన బోయింగ్ పై కొత్త పరిశీలనను పెంచింది. గురువారం బోయింగ్ షేరు ధర భారీగా పడిపోవడం మరో హైప్రొఫైల్ క్రాష్ వల్ల కలిగే నష్టాలపై ఇన్వెస్టర్ల ఆందోళనను ప్రతిబింబిస్తోంది.

ఇదీ చదవండి: ఊహించని ఘోరం.. విమాన ప్రమాదంపై అదానీ దిగ్భ్రాంతి

Advertisement
 
Advertisement
Advertisement