చక్రం ఊడి కుప్పకూలిన విమానం.. పలువురికి గాయాలు! | Shocking Video: Lufthansa Boeing Nose Gear Collapses Several Injured | Sakshi
Sakshi News home page

చక్రం ఊడి కుప్పకూలిన విమానం.. పలువురికి గాయాలు!

Jun 5 2026 8:44 AM | Updated on Jun 5 2026 8:51 AM

Shocking Video: Lufthansa Boeing Nose Gear Collapses Several Injured

బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాలు.. 2011 నుంచి ఈ విమానాలను అనేక అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌ ఉపయోగిస్తున్నాయి. అయితే అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాద సమయంలో ఈ విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది.  తాజాగా ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయంలో జరిగిన ఘటనతో అసలు ఈ విమానాలు సేఫేనా అనే చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది. 

జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ 787-9 డ్రీమ్‌లైనర్‌ విమానానికి ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. గేట్‌ వద్ద నిలిపి ఉంచిన సమయంలో విమానం ముందరి ల్యాండింగ్‌ గేర్‌ (నోస్‌ గేర్‌) ఒక్కసారిగా కుప్పకూలడంతో విమానం ముందు భాగం నేలపై పడిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న సిబ్బంది, గ్రౌండ్‌ స్టాఫ్‌లో పలువురు గాయపడ్డారు. 

ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్లాల్సిన LH450 విమానం అనూహ్యంగా ముందు చక్రం ఊడిపోవడం గమనార్హం. అయితే ఆ సమయంలో ప్రయాణికులు ఇంకా విమానంలోకి ఎక్కకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

ఈ ఘటనకు గల కారణాలపై సంబంధిత అధికారులు, లుఫ్తాన్సా సంస్థ దర్యాప్తు ప్రారంభించాయి. బోయింగ్‌ సంస్థ కూడా విచారణలో సహకరిస్తున్నట్లు తెలిపింది. కాగా ప్రమాదానికి గురైన ఈ బోయింగ్‌ 787-9 డ్రీమ్‌లైనర్‌ విమానం 2026 జనవరిలోనే వాణిజ్య సేవల్లోకి వచ్చిన కొత్త మోడల్‌ కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement