breaking news
shares crash
-
ఒక్క ‘ముద్దు’తో రూ.25 వేల కోట్లు ఆవిరి!
చైనా టెక్ రంగంలో సంచలనం రేపిన ఓ వ్యక్తిగత వివాదం, కేవలం కొన్ని గంటల్లోనే బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువను తుడిచిపెట్టేసింది. చైనాకు చెందిన ప్రముఖ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీ సంస్థ విక్టరీ జెయింట్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు, చైర్మన్ చెన్ టావో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంపెనీ షేర్లు ఒక్కసారిగా భారీ ఒత్తిడికి గురయ్యాయి.జూన్ 6న చైనా సోషల్ మీడియా వేదిక డౌయిన్‌లో "జెన్జెన్ జానిస్" పేరుతో ఉన్న ఓ యూజర్.. చెన్ టావోతో తనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తూ పలు పోస్టులు చేసింది. అందులో లిఫ్ట్‌లో ఓ మహిళతో చెన్ టావో చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి దృశ్యాలు ఉన్నాయని చైనా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. చెన్ టావో వివాహితుడు కావడంతో ఈ వీడియోలు వేగంగా వైరల్ అయ్యి చైనా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.పడిపోయిన షేర్లుఈ వివాదం స్టాక్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేసింది. జూన్ 8న విక్టరీ జెయింట్ టెక్నాలజీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఒక దశలో కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 20 బిలియన్ యువాన్లు (దాదాపు 2.9 బిలియన్ డాలర్లు) భారత కరెన్సీలో సుమారు రూ.25 వేల కోట్లు ఆవిరయ్యాయి. అయితే మరుసటి రోజున పెట్టుబడిదారుల ఆందోళనలు కొంత తగ్గడంతో షేర్లు తిరిగి కోలుకున్నాయి.వివాదంపై స్పందించిన కంపెనీ యాజమాన్యం.. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆరోపణలకు, సంస్థ కార్యకలాపాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఉత్పత్తి, ఆర్డర్లు, సరఫరా వ్యవస్థలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపింది. అలాగే ఈ వ్యవహారం కార్పొరేట్ గవర్నెన్స్ లేదా షేర్హోల్డర్లకు వెల్లడించాల్సిన కీలక అంశం కాదని పేర్కొంది. ఇక చెన్ టావో భవిష్యత్తు పాత్రపై వచ్చిన ప్రశ్నలకు మాత్రం "వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం" అంటూ స్పందించేందుకు నిరాకరించింది.54 ఏళ్ల చెన్ టావో స్థాపించిన విక్టరీ జెయింట్ టెక్నాలజీ అమెరికా ఏఐ చిప్ దిగ్గజం ఎన్విడియాకు ప్రధాన సరఫరాదారుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇటీవల హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో నిర్వహించిన భారీ ఐపీఓ ద్వారా సుమారు 2.6 బిలియన్ డాలర్లు సమీకరించి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. చెన్ టావో వ్యక్తిగత సంపద సుమారు 11.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.లక్ష కోట్లు). -
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భారీ కుదుపు..
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం ఇన్వెస్టర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిణామంతో గురువారం స్టాక్ మార్కెట్లో బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 1 లక్ష కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.అసలేం జరిగింది?మార్చి 17న పంపిన తన రాజీనామా లేఖలో చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్ధతులు, నిర్ణయాలు తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు."నేను బ్యాంకులో ఏదో తప్పు జరిగిందని ఆరోపించడం లేదు. కానీ నా వ్యక్తిగత భావజాలం, సంస్థ అనుసరిస్తున్న పద్ధతులు ఒకేలా లేవు. అందుకే తప్పుకుంటున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.ఆర్థిక శాఖ మాజీ బ్యూరోక్రాట్ అయిన చక్రవర్తి, 2021లో బోర్డులో చేరారు. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌తో విలీనం వంటి కీలక ప్రక్రియలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.మార్కెట్లో ప్రకంపనలుచక్రవర్తి నిష్క్రమణ వార్త బయటకు రాగానే మార్కెట్ తీవ్రంగా స్పందించింది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే షేరు ధర 9 శాతం మేర పడిపోయి రూ.770 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల పతనం కారణంగా బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ-50 వందల పాయింట్ల మేర నష్టపోయింది. అయితే, మార్కెట్ ముగిసే సమయానికి షేరు స్వల్పంగా కోలుకుని, క్రితం ముగింపుతో పోలిస్తే 3.8 శాతం నష్టంతో రూ.810.80 వద్ద స్థిరపడింది.రంగంలోకి దిగిన ఆర్బీఐపరిస్థితిని చక్కదిద్దేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తక్షణమే రంగంలోకి దిగింది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ వెటరన్ కేకీ మిస్త్రీని మార్చి 19 నుండి మూడు నెలల కాలానికి తాత్కాలిక పార్ట్ టైమ్ ఛైర్మన్‌గా నియమించేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది.బ్యాంకులో ఎలాంటి ఆధిపత్య పోరాటాలు, కార్యాచరణ లోపాలు లేవని కేకీ మిస్త్రీ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన బ్యాంక్ అని, దాని వద్ద తగినంత మూలధనం, నగదు లభ్యత ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. మేనేజ్మెంట్ తీరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు -
దేవుడి దెబ్బ అదుర్స్.. హెరిటేజ్ షేర్లు ఢమాల్..
-
విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లూ క్రాష్
ఎయిరిండియా విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లు కూడా కుప్పకూలాయి. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో గురువారం ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో బోయింగ్ కంపెనీ షేర్లు 7 శాతానికి పైగా పతనమయ్యాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘానీనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం బోయింగ్ విమానాల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది.ఏఐ-171 అనే విమానం లండన్ గాట్విక్‌కు బయలుదేరింది. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, ముగ్గురు చిన్న పిల్లలు సహా 242 మంది ఉన్నారు. రన్ వే 23 నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్ పోర్టు వెలుపల కూలిపోవడంతో దట్టమైన నల్లటి పొగలు గాల్లోకి ఎగిసిపడ్డాయి. కాగా విమానంలోని ప్రయాణికులందరూ చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి.బోయింగ్ 737 మ్యాక్స్, 787 మోడళ్లకు సంబంధించిన ఇటీవలి భద్రతా సమస్యల కారణంగా కంపెనీ ఇప్పటికే రెగ్యులేటరీ, పెట్టుబడిదారుల ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ సంఘటన బోయింగ్ పై కొత్త పరిశీలనను పెంచింది. గురువారం బోయింగ్ షేరు ధర భారీగా పడిపోవడం మరో హైప్రొఫైల్ క్రాష్ వల్ల కలిగే నష్టాలపై ఇన్వెస్టర్ల ఆందోళనను ప్రతిబింబిస్తోంది.ఇదీ చదవండి: ఊహించని ఘోరం.. విమాన ప్రమాదంపై అదానీ దిగ్భ్రాంతి


