ఏఐ హార్డ్‌వేర్‌కు అదానీ, జబిల్‌ జత | Adani-Jabil JV AI Hardware Data Center Equipment manufacturing | Sakshi
Sakshi News home page

ఏఐ హార్డ్‌వేర్‌కు అదానీ, జబిల్‌ జత.. 50:50 వాటాతో జేవీ

Oct 14 2026 6:50 PM | Updated on Oct 14 2026 7:00 PM

Adani-Jabil JV AI Hardware Data Center Equipment manufacturing

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) హార్డ్‌వేర్‌ తయారీకి వీలుగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, యూఎస్‌ తయారీ కంపెనీ జబిల్‌ చేతులు కలిపాయి. సమాన వాటా(50:50) భాగస్వామ్యంతో దేశీయంగా ఏఐ, డేటా సెంటర్‌ పరికరాల తయారీకి భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నాయి. కంప్యూటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో తాజా జేవీకి తెరతీశాయి. 

ప్రతిపాదిత వెంచర్‌ ఏఐ ర్యాక్‌లు, సర్వర్లు, స్టోరేజీ, నెట్‌వర్కింగ్‌ పరికరాలు, విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలు, లిక్విడ్‌ కూలింగ్‌ ఎక్విప్‌మెంట్‌ సిస్టమ్స్, ట్రాన్స్‌ఫార్మర్స్‌ తయారీ, అసెంబ్లింగ్‌ను చేపట్టనుంది. తద్వారా హైసర్‌స్కేలర్స్, డేటా సెంటర్‌ ఆపరేటర్లతోపాటు..  దేశ, విదేశీ కస్టమర్లకు అవసరమైన మలీ్టగిగావాట్‌ తయారీ ప్లాట్‌ఫామ్‌కు తెరలేవనుంది. 

కాగా.. జేవీ ఏర్పాటుకు వీలుగా అదానీ, జబిల్‌ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దేశీయంగా డేటా సెంటర్ల డిమాండ్‌తో 2030కల్లా 5–8 గిగావాట్ల సామర్థ్యాలను పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. డేటా సెంటర్లు, క్లౌడ్, ఏఐ ఎకోసిస్టమ్స్‌ తదితరాలపై 50 బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడులు వెచ్చించే ప్రణాళికలున్నట్లు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement