కూలిన రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ సీసీ లైనింగ్‌ గోడలు | - | Sakshi
Sakshi News home page

కూలిన రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ సీసీ లైనింగ్‌ గోడలు

Aug 17 2026 12:17 AM | Updated on Aug 17 2026 12:17 AM

జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్‌ గ్రామ సమీపంలో సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు మెయిన్‌ కెనాల్‌ నుంచి ఖమ్మం జిల్లా ఏన్కూర్‌ నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు అనుసంధానంతో నిర్మించిన రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ గోడలు నీటి ప్రవాహానికి విరిగిపడింది. ఇరువైపుల సుమారు 10 మీటర్లు విరిగి కాలువలో పడ్డాయి. గతేడాది సీతారామ ప్రాజెక్టు కెనాల్‌ నుంచి గోదావరి జలాలు ఏన్కూర్‌ నాగార్జున సాగర్‌ కాలువకు తరలించేందుకు సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ సీసీ లైనింగ్‌ గోడలు కొద్ది కాలానికే కూలిపడటంతో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement