రమణీయం.. రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

రమణీయం.. రామయ్య కల్యాణం

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. తొలుత తెల్లవారుజాము న గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశా రు. అనంతరం స్వామివారిని నిత్యకల్యాణా నికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో కొలువుదీర్చారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

నేడు మంత్రి వివేక్‌ పర్యటన

మణుగూరు టౌన్‌: రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ మంత్రి వివేక్‌ వెంకటస్వామి మంగళవారం మణుగూరులో పర్యటించనున్నారు. ముత్యాలమ్మనగర్‌లోని ఐటీఐ కళాశాలలోని ఏటీసీలో విద్యార్థులు తయారు చేసిన ఈవీ వాహనాలను పరిశీలించనున్నారు. ఆన్‌లైన్‌ జాబ్‌ ఇంటర్వ్యూ పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయనున్నారు. భోజనం అనంతరం చెన్నూరు బయల్దేరి వెళ్లనున్నారు.

అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి రాహుల్‌

భద్రాచలం: అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి బి. రాహుల్‌ అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సంబంఽధిత యూనిట్‌ అధికారులకు అందజేసి, అర్హతల మేరకు పరిష్కరించాలని ఆదేశించారు. భూమి, పోడు పట్టాల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, పెన్షన్లు, గృహాలు, మౌలిక వసతుల సమస్యలపై అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని అన్నారు. అధికారులు ఆనంద్‌ కుమార్‌, చందన, సైదులు, మధుకర్‌, గన్యా, వేణు, మనిధర్‌, రాంబాబు, వసుంధర, హరికృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు.

పారదర్శకంగా పౌరసేవలు

ఎస్పీ రోహిత్‌రాజు

ఇల్లెందు: ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగిస్తూ పౌరసేవలను మరింత వేగవంతంగా పారదర్శకంగా అందించాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. ఇల్లెందు పోలీసుస్టేషన్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టేషన్‌లో నమోదైన, పెండింగ్‌ కేసులను సత్వర పరిష్కరించాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయల్‌ 112కు ఫోన్‌ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాదితులకు అండగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకన్నబాబు, సీఐ తాటిపాముల సురేష్‌, ఎస్సైలు ఉమా, సారంగపాణి, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు దిశా సమావేశం

చుంచుపల్లి: ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు దిశా కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ అంకిత్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం పార్లమెంటు సభ్యు డు రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశానికి కమిటీ కో చైర్మ న్‌, మహబూబాబాద్‌ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాంనాయక్‌, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement