ఆదిలోనే అలక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆదిలోనే అలక్ష్యం

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

ఇసుక కోసం..

మొక్కుబడిగా మండలస్థాయి ప్రజావాణి

తొలిసారే గైర్హాజరైన పలు శాఖల అధికారులు

22 మండల పరిషత్‌ల్లో

250 ఫిర్యాదులు

చుంచుపల్లి/పాల్వంచరూరల్‌/ఇల్లెందురూరల్‌/పినపాక: మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో సోమవారం తొలిసారిగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి స్పందన నామమాత్రంగానే ఉంది. ప్రజలు వినతులతో కార్యాలయాలకు చేరుకోగా, అధికారులు సకాలంలో రాకపోవడంతో నిరీక్షించాల్సి వచ్చింది. పలు చోట్ల ప్రజావాణి ఆలస్యంగా ప్రారంభమైంది. అనే క మండలాల్లో అధికారులు మొక్కుబడిగా హాజరయ్యారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. సమయ పాలన పాటించలేదు. సుమారు 24 నుంచి 25 శాఖల అధికారులు హాజరుకావాల్సి ఉండగా, కొన్నిచోట్ల 10 మంది కూడా హాజరు కాలేదు.

జిల్లాలోని 22 మండల పరిషత్‌ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించగా, 427 మంది అధికారులు హాజరయ్యారు. మొత్తం 250 అర్జీలు వచ్చాయి. అత్యధికంగా దుమ్ముగూడెంలో 41, అతి తక్కువగా అన్నపురెడ్డిపల్లిలో ఒక దరఖాస్తు వచ్చాయి. మరోవైపు కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి మాత్రం ప్రజల రాక తగ్గలేదు.

నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇసుక కొరత వల్ల నాలుగు నెలలుగా పని నిలిచి పోయింది. ఇసుక కావాలని అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదు అందించాను. అధికారులు దరఖాస్తును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

–ఎనుముల శ్రీనివాస్‌, పెనుబల్లి

పాల్వంచలో నిర్దేశించిన సమయానికి ప్రజావాణి ప్రారంభంకాలేదు. సుమారు 25 శాఖల అధికారులు హాజరుకావాల్సి ఉండగా, 16 శాఖల అధికారులే హాజరయ్యారు. హాజరైనవారిలో పలువురు మధ్యలోనే వెళ్లిపోయారు. అర్జీల ఆన్‌లైన్‌లో జాప్యం జరిగింది. ఇక అధికారులు ఎక్కువ మంది తమ స్మార్ట్‌ ఫోన్‌ వీక్షించుకుంటూ సమయం గడిపారు.

ఇల్లెందులో అధికారులు ఆలస్యంగా, నింపాదిగా హాజరయ్యారు. మూడు గంటలపాటు జరగాల్సిన కార్యక్రమం 2 గంటలకే పరిమితమైంది. నిర్దేశిత సమయానికి ముగ్గురే అధికారులు వచ్చారు. అధికారులు ఆలస్యంగా రావడంతో ప్రజలు చెట్ల కింత నిరీక్షించాల్సి వచ్చింది.

పినపాక మండలంలో ప్రజావాణి మొక్కుబడిగా సాగింది. ఉదయం 11 గంటలకు వరకు ఇద్దరు అధికారులే హాజరయ్యారు. దుమ్ముగూడెంలో ఎమ్మెల్యే వెంకట్రావు కోసం ఎదురుచూడటంతో ప్రజావాణి 12–44 గంటలకు ప్రారంభమైంది. అప్పటి నుంచి సుమారు 45 నిమిషాలు దరఖాస్తులు స్వీకరించగా, వివిధ సమస్యలపై 41 మంది అర్జీలు పెట్టుకున్నారు. కాగా, ప్రజలు, అధికారులు 2.45 గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది.

మండలాల వారీగా హాజరైన అధికారులు, వచ్చిన ఫిర్యాదులు

మండలం అధికారులు ఫిర్యాదులు మండలం అధికారులు ఫిర్యాదులు

ఆళ్లపల్లి 13 02 జూలూరుపాడు 23 02

అన్నపురెడ్డిపల్లి 19 01 కరకగూడెం 10 05

అశ్వాపురం 15 04 లక్ష్మీదేవిపల్లి 21 10

అశ్వారావుపేట 27 12 మణుగూరు 19 12

భద్రాచలం 15 04 పాల్వంచ 26 23

బూర్గంపాడు 22 24 పినపాక 18 11

చండ్రుగొండ 17 02 సుజాతనగర్‌ 20 05

చర్ల 20 02 టేకులపల్లి 19 08

చుంచుపల్లి 23 21 ఇల్లెందు 24 15

దమ్మపేట 20 11 దుమ్ముగూడెం 23 41

గుండాల 18 17 ములకలపల్లి 15 18

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement