అశ్వారావుపేట: అక్రమంగా మట్టి తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ వివాహితుడు మృతిచెందాడు. అశ్వారావుపేట ఎస్‌ఐ యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం అశ్వారావుపేట మండలం కేశప్పగూడెం గ్రామానికి చెందిన మల్లం నాగరాజు(23) తన భార్యను పుట్టింటి నుంచి తీసుకొచ్చేందుకు అదే మండలానికి చెందిన భీమునిగూడెంకు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈక్రమాన జమ్మిగూడెం నుంచి అశ్వారావుపేటకు అక్రమంగా మట్టి తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ఢీకొ నడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు అశ్వారావుపేట పోలీసులు మృతదేహాన్ని అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, ఈప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై యయాతి రాజు తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని వివాహితుడు మృతి


