కొత్తగూడెంఅర్బన్: పుట్టిన శిశువులకు తల్లిపాలనే పట్టించాలని, ముర్రుపాలు బిడ్డకు వ్యాధినిరోధక శక్తిని ఇస్తాయని ఐసీడీఎస్ పీడీ స్వర్ణలత లెనినా, కార్పొరేటర్ జల్లి శ్రీలక్ష్మి తెలిపా రు. శనివారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 28వ డివిజన్‌లో తల్లిపాల వారోత్సవాలను వారు ప్రారంభించి మాట్లాడారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతంలాంటివని, పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తల్లిపాలు ఎంతో ప్రధానమని తెలిపారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా, రోగ నిరోధక శక్తిని పొందాలన్నా తల్లిపాలు పట్టించాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం సీడీపీఓ పద్మశ్రీ మాట్లాడుతూ.. వారం రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
వరద ప్రభావిత
ప్రాంతాల్లో మెరుగైన సేవలు
దుమ్ముగూడెం: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించా లని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. శనివారం మండలంలోని పర్ణశాల, దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానలు తనిఖీ చేశారు. రికా ర్డుల నిర్వహణను తనిఖీ చేశారు. బాధితులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రసవ తేదీలో సమీపంలో ఉన్న గర్భిణులను డెలివరీ వెయిటింగ్ హాల్‌కు తరలించాలని సూచంచా రు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. పంచా యతీ సిబ్బందితో సమన్వయం చేసుకొని పారి శుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. డాక్టర్ రుక్మాకర్‌రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
95 మంది
బాలకార్మికులకు విముక్తి
సూపర్‌బజార్(కొత్తగూడెం): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేష న్ ముస్కాన్‌లో జిల్లావ్యాప్తంగా 95 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారని, అన్ని శాఖల సమన్వయంతో ఇది సాధ్యమైందని ఎస్పీ రోహిత్‌రాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం జిల్లాలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేశామని పేర్కొన్నారు. 95 మందిలో 89 మంది బాలురు, ఆరుగురు బాలికలు ఉన్నారని, 48 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేశామని, 38 మందికి నోటీసులు ఇచ్చామని వివరించారు. బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100, 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.
తగ్గిన పామాయిల్
గెలల టన్ను ధర
అశ్వారావుపేటరూరల్: పామాయిల్ గెలల టన్ను ధర తాజాగా రూ.295 తగ్గింది. శనివారం హైదరాబాద్‌లోని ఆయిల్‌ఫెడ్ ప్రధాన కార్యాలయంలో ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్‌బాషా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పామాయిల్ గెలల టన్ను ధరను రూ.23,488గా ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో టన్ను ధర రూ.23,783 ఉండగా, తాజా ధరతో పోల్చితే టన్నుకు రూ.295 తగ్గినట్లయింది.
ఆర్టీసీ బస్టాండ్‌లో తల్లిపాలు ఇచ్చే గది షురూ
సూపర్‌బజార్(కొత్తగూడెం): బిడ్డ పుట్టిన మొద టి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని, ఆ తర్వాత మరో ఏడాది పాటు తల్లిపాలు ఇవ్వడం తల్లీబిడ్డల ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటిదని జిల్లా సంక్షేమ అధికారి జె.స్వర్ణలతలెనినా అన్నారు. కొత్తగూడెం బస్టాండ్‌లో తల్లి పాలిచ్చే గదిని శనివారం ప్రారంభించి బాలింతలకు తల్లిపాల అవశ్యకతపై అవగాహన కల్పించారు. ప్రసవించిన మొదటి గంటలోపే తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రారంభించాలని, ఆరు నెలల నిండే వరకు కేవలం తల్లిపాలు మాత్ర మే పట్టించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం అర్బన్ సీడీపీఓ, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది, మహిళా సాధికారిత జిల్లా బృందం, ఆర్టీసీ డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది, బాలింతలు పాల్గొన్నారు.


