మంత్రులు హైదరాబాద్‌లో..
56కు చేరుకుని..
ఉదయం 11 గంటలకు 56.10 అడుగులుగా నమోదైన గోదావరి నీటిమట్టం రెండు గంటలు నిలకడగా.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి రోడ్లపైకి వరద నీరు చేరి ఏజెన్సీ గ్రామాల్లో నిలిచిన రాకపోకలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు.. కరువైన మంత్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ
గోదావరి వరద శనివారం ఉదయం 11 గంటలకు 56.10 అడుగులకు చేరుకుంది. అనంతరం 2 గంటలపాటు ప్రవాహం నిలకడగా కొనసాగి, ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతోంది. సాయంత్రం 5 గంటలకు 55.50 అడుగులకు తగ్గింది. రాత్రి 11.16 గంటలకు 52.90 అడుగులకు తగ్గడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. రాత్రి 12 గంటలకు...... అడుగులుగా నమోదైంది. స్నానఘట్టాలు, శివాలయం, ఆంజనేయస్వామి గుడి, కల్యాణ కట్టలు ఇంకా వరదలోనే ఉన్నాయి. విస్తా కాంప్లెక్స్ స్లూయిస్‌ల వద్ద నీటిని తోడే యంత్రాలను అధికారులు పర్యవేక్షించారు.
మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిచటంతో భద్రాచలం నుంచి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. దుమ్ముగూడెం మండలంలో తూరుబాక, గంగోలు ప్రధాన రోడ్డుపై, సున్నం బట్టి, బైరాగులపాడు గ్రామాల నడుమ, పర్ణశాల వద్ద రోడ్డుపైకి నీరు చేరటంతో శనివారం సైతం రాకపోకలు సాగలేదు. చర్ల మండలంలో కుదునూరు, దండుపేట గ్రామాల వద్ద రోడ్లపైకి వరద చేరటంతో చర్లకు రాకపోకలు ఆగిపోయాయి. కూనవరం వైపు నూతనంగా నిర్మిస్తున్న కరకట్ట వైపు జాతీయ రహదారి ఎన్‌హెచ్ 30పైకి నీరు వస్తుండటంతో విజయవాడ–జగ్‌దల్‌పూర్ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. అంతకు ముందు కొన్ని వాహనాలు వరదలో చిక్కుకుపోగా యంత్రాల ద్వారా బయటకు తరలించారు. కొత్తగా మూడు స్లూయిస్ నిర్మించగా, అందులో ఒకటి లీకవుతోంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న జామాయిల్, పామాయిల్, ఇతర పంట పొలాలు నీట మునిగాయి.
కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, ఎస్పీ రోహిత్‌రాజు భద్రాచలంలో ఉండి వరద ప్రాంతాలను పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు దుమ్ముగూడెం, బూర్గంపాడు మార్గాల్లో బారికేడింగ్‌ను పరిశీలించారు. శనివారం ఉదయం కూనవరం రోడ్డులో జాతీయ రహదారిపై వేసిన మట్టి అడ్డుకట్టను పరిశీలించారు. స్నానఘాట్లు, కరకట్ట, భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారి వెంట వరద పరిస్థితులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు. ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఉధృతంగా ప్రవహించిన గోదావరి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు వేగంగా పెరిగిన వరద శనివారం ఉదయం నుంచి నెమ్మదించింది. మధ్యాహ్నం 56 అడుగులకు చేరుకున్న నదీ నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. శనివారం రాత్రి 11.16 గంటలకు 52.90 అడుగులకు తగ్గడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కాగా, 14 గంటల వ్యవధిలోనే ఒకటి, రెండో, మూడో ప్రమాద హెచ్చరికలు జారీ కావడం ఇదే ప్రథమంగా ప్రజలు భావిస్తున్నారు. –భద్రాచలం
సాధారణంగా ఉమ్మడి జిల్లా మంత్రులు గోదావరి వరదల సమయంలో అప్రమత్తంగా ఉంటారు. ఈసారి కూడా సీజన్ ఆరంభంలో తుమ్మల, పొంగులేటి భద్రాచలంలో పర్యటించి వరదల విషయంలో సూచనలు చేశారు. రెండు రోజులుగా హైదరాబాద్ నుంచే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి సైతం వరద సహాయక చర్యలపై ఆరా తీశారు. ఎంపీ బలరాంనాయక్ స్థానికంగా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.


