భద్రాచలంటౌన్: ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది భద్రాచలంలో 24 గంటలూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. కరకట్ట, స్నాన ఘాట్లు, ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతర పహారా కాస్తున్నారు. జిల్లాలోని ఆరు ఫైర్ స్టేషన్ల నుంచి వచ్చిన 25 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. రెస్క్యూ పరికరాలు, లైఫ్ జాకెట్లు, తాళ్లు, బోట్లు అందుబాటులో ఉంచారు. మూడు రోజులుగా గోదావరిలో స్నానాలకు వచ్చే భక్తులను నదిలోకి దిగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఫైర్ అధికారి క్రాంతికుమార్, భద్రాచలం ఫైర్ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు.


