భద్రాచలం టౌన్: భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారిపై లారీలు, కార్లు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఏపీ నుంచి వస్తున్న వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించాక నిలిచిపోయాయి. గోదావరి వరద నీరు భద్రాచలంలోకి రాకుండా ప్రధాన రహదారిపై అధికారులు అడ్డంగా మట్టికట్టను ఏర్పాటు చేశారు. వెనక్కి వెళ్దామంటే అప్పటికే వెనుక ఉన్న పురుషోత్తపట్నం వద్ద వరద నీరు రోడ్డును ముంచెత్తింది. అటు వెళ్లలేక ఇటు రాలేక వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కలెక్టర్ చొరవతో మట్టికట్టను కొద్దిగా తొలగించి, లారీలు, కార్లను పొక్లెయినర్ సహాయంతో సురక్షితంగా బయటకు తరలించారు.


