ఐదుగురు గర్భిణుల ప్రసవం | - | Sakshi
Sakshi News home page

ఐదుగురు గర్భిణుల ప్రసవం

Aug 2 2026 12:58 AM | Updated on Aug 2 2026 12:58 AM

భద్రాచలంఅర్బన్‌: ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా తరలించిన 25 మంది హైరిస్క్‌ గర్భిణుల్లో ఐదుగురు శనివారం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సాధారణ ప్రస వం పొందారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ప్రమీలరాణి, పూజ తెలిపారు. గోదావరి వరదల నేపథ్యంలో గర్భిణులను ముందస్తుగా ఆస్పత్రికి తరలించి, సకాలంలో వైద్య సేవలు అందించడంతో వైద్యాధికారులను పలువురు అభినందించారు. శనివారం ఐటీడీఏ పీఓ రాహుల్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సైదులు ఆస్పత్రిని సందర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement