ప్రాణం తీసిన సహజీవనం | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన సహజీవనం

Mar 11 2024 6:00 AM | Updated on Mar 11 2024 1:10 PM

- - Sakshi

 గుంటూరు ఈస్ట్‌: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన నగరంలో కలకలం రేపింది. పాత గుంటూరు ఎస్‌హెచ్‌ఓ రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర కాలనీలో నివసించే ఆశ ఆరు నెలల కిందట రాజమండ్రి నుంచి గుంటూరు వచ్చింది. మొదట శివ అనే వ్యక్తిని వివాహం చేసుకుని విడిపోయింది. అనంతరం దుర్గారావుతో సహజీవనం చేసి విడిపోయింది. ఆశకు నలుగురు పిల్లలు ఉన్నారు.

గతంలో మూడో వ్యక్తితో సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఆశ ఓ వ్యక్తితో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మూడు వంతెనల వద్ద దుర్గారావు వారిని అడ్డకున్నాడు. తనతో తిరిగి సహజీవనం చేయాలని కోరాడు. ఆశ అందుకు నిరాకరించింది. దీంతో దుర్గారావు బెదిరించాడు. అయితే, అనూహ్యంగా ఎంప్లాయీస్‌ కాలనీ మెయిన్‌ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున నడిరోడ్డుపై శవమై కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement