● స్తంభానికి కట్టేసి దేహశుద్ధి
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఆవుల దొంగను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన ఆదివారం రాత్రిచోటు చేసుకున్న ఘటనపై వివరాలు.. మండలంలోని వేంపల్లి పంచాయతీ, మునగమాకుల పల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం, ఓ దొంగ ఆవుల షెడ్డులోకి ప్రవేశించి ఆవులను పట్టుకుని బయటకు తరలిస్తుండగా యజమాని రవి గమనించాడు. వెంటనే అప్రమత్తమైన దొంగను పట్టుకుని, స్తంభానికి కట్టేశాడు. అనంతరం దేహశుద్ధి చేసి తాలూకా పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి ఇతర దొంగతనాల్లో ప్రమేయం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు.
● టైర్‌పగిలి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న
వాహనం
● నలుగురికి గాయాలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ దర్శనార్థనం వచ్చి తిరుగుప్రయాణంలో భక్తులతో వెళ్తున్న ఈచర్ వాహనం టైర్ పగిలి విధ్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన ఆదివారం అన్నిపల్లె సమీపంలోని బచ్చనికుంట వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరుకు చెందిన భక్తులు గంగమ్మ దర్శనార్థం బోయకొండకు వచ్చారు. దర్శనం అనంతరం విందు భోజనం ఏర్పాటుచేసుకొని బోయకొండ నుంచి కొలింపల్లె మీదుగా పుంగనూరుకు బయలు దేరారు. ఒక్కసారిగా వాహనం టైర్ పగలడంతో అదుపు తప్పి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ప్రమాదం సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వాహనంలోని భక్తుల్లో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక ఇమామ్‌నగర్‌లోని ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్కూట్‌తో వస్తువులన్నీ బూడిదైనట్లు బాధితురాలు వెంకటసుబ్బమ్మ వాపోయారు. వేంపల్లెలోని ఇమాంనగర్‌కు చెందిన వెంకటసుబ్బమ్మ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్కూట్ జరిగింది. అగ్ని మంటలు ఎగిసిపడడంతో పాటు పెద్ద శబ్దం రావడంతో నిద్రలో ఉన్న వెంకట సుబ్బమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న ఫ్రిజ్, కూలర్, వాషింగ్ మిషన్‌తో పాటు విలువైన వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు.


