నిమ్మనపల్లి (మదనపల్లె టౌన్) : గొర్రెల మందలోని ఓ పొట్టేలు దాడి చేయడంతో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ఉదయం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. వివరాలు.. నిమ్మనపల్లె మండలం, చలిమామిడికి చెందిన రాజన్న గొర్రెలు మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య ఎల్లమ్మ (45) చెత్త ఊడ్చేందుకు గొర్రెల మంద వద్దకు వెళ్లింది. ఈ సమయంలో అక్కడ ఉన్న ఓ పొట్టేలు ఒక్కసారిగా ఆమైపె దాడి చేసింది. ఈ దాడిలో ఎల్లమ్మ తుంటి ఎముక విరిగి తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు 108 అంబులెనన్స్‌లో బాధితురాలిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎల్లమ్మకు ప్రథమ చికిత్సలు అందించి, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు.


