● కుటుంబ పెద్దను కాపాడుకునేందుకు భూమినీ అమ్మేసినా లభించని ఊరట ● అప్పుల ఊబిలో నిరుపేద కుటుంబం : దాతల కోసం ఎదురుచూపు ● బెంగళూరులో చిన్న ఉద్యోగం చేస్తున్న యోగేశ్వర్‌ రెడ్డిని కాటేసిన అనారోగ్యం ● పడిపోతున్న తెల్ల రక్తకణాలతో ఆసుపత్రిలో మృత్యుపోరాటం ● ఇప్పటికే | - | Sakshi
Sakshi News home page

● కుటుంబ పెద్దను కాపాడుకునేందుకు భూమినీ అమ్మేసినా లభించని ఊరట ● అప్పుల ఊబిలో నిరుపేద కుటుంబం : దాతల కోసం ఎదురుచూపు ● బెంగళూరులో చిన్న ఉద్యోగం చేస్తున్న యోగేశ్వర్‌ రెడ్డిని కాటేసిన అనారోగ్యం ● పడిపోతున్న తెల్ల రక్తకణాలతో ఆసుపత్రిలో మృత్యుపోరాటం ● ఇప్పటికే

Aug 11 2026 12:36 AM | Updated on Aug 11 2026 12:36 AM

మదనపల్లి టౌన్‌: రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబంలో అనూహ్యంగా సంభవించిన అనారోగ్యం కోలుకోలేని దెబ్బ తీసింది. ఉన్నంతలో సాధారణ జీవితం గడుపుతూ, రేపటి భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్న ఆ పేద గూటిలో ప్రస్తుతం గుండెల్ని పిండేసే విషాదం అలుముకుంది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం, వేపుమానుపేట గ్రామం, కొత్తపూల వాండ్లపల్లికి చెందిన యోగేశ్వర్‌ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండటంతో ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడింది. ఆయన శరీరంలో తెల్ల రక్త కణాలు ఊహించని విధంగా, అత్యంత వేగంగా పడిపోతుండటంతో ప్రాణాలు గాల్లో దీపంగా మారాయి. ప్రస్తుతం కార్పొరేట్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.

చిన్న ఉద్యోగం.. అంతలోనే ఆర్థిక సంక్షోభం

యోగేశ్వర్‌ రెడ్డి బెంగళూరులో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని ఎంతో బాధ్యతాయుతంగా, కంటికి రెప్పలా పోషించేవారు. కుటుంబానికి ఏకై క జీవనాధారమైన వ్యక్తి ఇలా ఆసుపత్రి పాలుకావడంతో ఆ ఇల్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న భార్య, బంధువులు, మిత్రులు ఆస్పత్రి ఖర్చులు భరించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. యోగేశ్వర్‌ రెడ్డి ప్రాణాలు నిలవాలంటే సుమారు రూ.50 లక్షలకు పైగా భారీ వ్యయంతో కూడిన అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు.ఉన్న భూమిని అమ్మేసినా దక్కని ప్రాణభిక్ష..భర్తను కాపాడుకునేందుకు ఆ ఇల్లాలు తన శక్తిమేరకు సర్వస్వం ఖర్చు పెట్టింది. తమకున్న ఒకే ఒక్క జీవనాధారమైన వ్యవసాయ భూమిని సైతం కన్నీటితో విక్రయించి, ఇప్పటివరకు రూ.25 లక్షలను వైద్య ఖర్చుల కోసం వినియోగించింది. ఉన్న ఆస్తిని అమ్ముకున్నా భర్తను ఇంకా ఇంటికి తెచ్చుకోలేకపోయామే అని ఆ భార్య పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇప్పటికే సగం ఖర్చు భరించిన ఆ నిరుపేద కుటుంబం ఇప్పుడు రూపాయి కూడా పుట్టని దయనీయ స్థితిలో పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సను ఇలాగే కొనసాగించాలన్నా, ఆయనకు పూర్తిస్థాయి ప్రాణభిక్ష దక్కాలన్నా తక్షణమే అదనంగా మరో రూ.25 లక్షల ఆర్థిక సహాయం అత్యవసరంగా అవసరమవుతోంది.

తండ్రి ప్రేమకు నోచుకోని పసిగుడ్డు

ఆ పసిగుడ్డుకు ఇంకా ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. కేవలం 45 రోజుల వయసు మాత్రమే ఉన్న ఆ పసిబిడ్డ, తండ్రి ఒడిలో తలవాల్చి హాయిగా నిద్రించాల్సిన అపురూపమైన సమయం అది. కానీ, విధి ఆ చిన్నారిపై కనికరం చూపలేదు. పుట్టిన నలభై ఐదు రోజులకే.. కన్నతండ్రి ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిన దయనీయ స్థితి ఎదురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement