● సింగిల్‌లైన్‌కే పరిమితం
● డివిజన్‌లో నెరవేరని లక్ష్యం
రాజంపేట : ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గం డబ్లింగ్‌కు నోచుకోలేదు. ఏళ్లతరబడి సింగల్ లైన్‌కే పరిమితమైంది. ప్రతిచోటా డబుల్‌లైన్లు వేయాలన్నది రైల్వేబోర్డు లక్ష్యం. గుంతకల్ రైల్వే డివిజన్‌లో ఆ దిశగా అడుగులు పడటం లేదనే విమర్శలున్నాయి. నిధులు కేటాయిస్తున్నా పనులు చేపట్డంలేదు. పైగా నిధులను వేరే పనులకు మళ్లిస్తున్నారు. దీనివల్ల సింగల్‌లైన్‌లో అధికారులు ఎక్కువ రైళ్లను నడపలేకున్నారు. ఫలితంగా అవసరమైన సమయా ల్లో తగినన్ని రైళ్లు అందుబాటులోకి రాక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆ రెండుమార్గాల్లో..
ఎర్రగుంట్ల–నంద్యాల (123 కి.మీ), ధర్మవరం–పాకాల (228 కి.మీ)లో ఎన్నో ఏళ్లుగా డబుల్ లైన్ కల సాకారం కావడంలేదు. ఇందులో ధర్మవరం–పాకాల మధ్య డబ్లింగ్‌కు మూడేళ్ల క్రితం ప్రభుత్వం మొదటివిడత కింద రూ.4కోట్లు విడుదల చేసింది. ఈ అంశాన్ని కార్యాచరణ ప్రణాళికలోనూ పొందుపరిచింది. అధికారులు నిర్లక్ష్యంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో వ్యయం రెండింతలు పెరిగిపోయింది. ఈ రెండు మార్గాల్లో డబ్లింగ్ చేస్తే డివిజన్ సంపూర్ణ డబ్లింగ్ డివిజన్‌గా మారుతుంది. అంతేగాకుండా ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడిపి తిరుపతికి వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పించవచ్చు. ఇటు సర్కారు ప్రాంతానికి మరింత కనెక్టిటివి పెరుగుతోంది. అలాగే రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తులు పట్టణాలకు తరలించే సౌలభ్యం ఒనగూరుతుంది. గూడ్స్‌ల రవాణా, ప్ర యాణికుల రద్దీ పెరిగితే రెండవలైను మార్గం సుగ మం అవుతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి.
ఎర్రగుంట్ల–నంద్యాల సింగల్‌లైను ఇలా..
నంద్యాల–ఎర్రగుంట్ల రైలుమార్గం నంద్యాల జిల్లా, వైఎస్సార్ కడప జిల్లాకు అనుసంధానం చేసే సింగల్‌లైను. నల్లపాడు–నంద్యాలలో లైను కలుస్తుంది. ఇది గుంటూరు డివిజన్‌లో ఉన్న నంద్యాల రైల్వేస్టేషను ఎస్సీవోఆర్‌లో గుంతకల్‌డివిజన్ ద్వారా నిర్వహించబడుతోంది.


