అర్హులందరికీ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇవ్వాలి

Aug 10 2026 12:46 AM | Updated on Aug 10 2026 12:46 AM

మగ్గం నడిస్తేనే పొట్ట నిండే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నిఽబంధనల పేరుతో పొట్ట కొట్టడం దారుణం. ప్రతి నేతన్నకు నేతన్న సేవ ఇవ్వాలి. జగన్‌ ప్రభుత్వంలో అందరికీ ఇచ్చినట్లుగా ప్రతి చేనేత కార్మికుడికి ఆర్థిక సాయం వర్తింపజేయాలి. కష్ట పడి మగ్గం నేసే చేతులకు సాయంలో మొండిచేయి చూపడం విచారకరం.

–భాస్కర్‌ రెడ్డి, చేనేత కార్మిక యూనియన్‌ నాయకులు

30 ఏళ్లుగా ఈ వృత్తిలోనే ఉన్నా..

వ్యవసాయం తర్వాత చేనేత వృత్తి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. 30 ఏళ్లుగా చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నా. అయినా నేతన్న సేవ పథకం నిధులు ఖాతాలో జమ కాలేదు. అర్హత ఉన్నా ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు.

–కె.ప్రసాద్‌, చేనేత కార్మికుడు,

అమ్మచెరువు మిట్ట, మదనపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement