11 నుంచి బాస్కెట్‌ బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

11 నుంచి బాస్కెట్‌ బాల్‌ పోటీలు

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

వాల్మీకిపురం : అమరావతి క్రీడోత్సవాల్లో భాగంగా అన్నమయ్య జిల్లా స్థాయిలో ఈ నెల 11వ తేదీ నుంచి బాస్కెట్‌ బాల్‌ అండర్‌ 17, అండర్‌ 23 బాలబాలికల పోటీలను జిల్లా స్పోర్ట్స్‌ స్కూల్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో వాల్మీకిపురంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎస్‌ఆర్‌ సంస్థల అధినేత, జిల్లా బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చింతల శ్రీధర్‌రెడ్డిని విద్యాశాఖ అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి జిల్లా స్థాయి బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌, జిల్లా సెలెక్షన్స్‌ను నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన బాస్కెట్‌ బాల్‌ పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, తమ వంతుగా ఎటువంటి సహాయ సహకారాలైనా అందిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీలు నాగరాజు, కిరణ్‌, రెడ్డి వరప్రసాద్‌, సీనియర్‌ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు సాయిభార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement