ఈ సంవత్సరం రూ. 2 లక్షలు అప్పు చేసి మామిడి తోటకు మందులు కొట్టాము. కానీ రేట్లు లేకపోవడంతో పెట్టుబడి రాకపోగా, రవాణా ఖర్చులు కూడా మా చేతి నుంచే పెట్టుకోవాల్సి వచ్చింది. ఇకపై ఈ పంటకు ఎంత పెట్టుబడి పెట్టినా లాభం లేదు. దీనికి తోడు వర్షాలు లేక ఉన్న చెట్లు ఎండిపోతున్నాయి. అందుకే దిక్కుతోచని స్థితిలో ఇప్పటికే నాకున్న మూడు ఎకరాలలోని మామిడి చెట్లను పూర్తిగా తొలగించేశాను. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను తక్షణమే ఆదుకోవాలి.
– సుబ్రమణ్యం, బంగారువాండ్లపల్లె


