ప్రారంభమైన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

మదనపల్లె సిటీ : మదనపల్లె మండలం ఆరోగ్యవరంలో జెసోడియన్‌ ఫుట్‌బాల్‌ మైదానంలో నిర్వహిస్తున్న ఆడమ్‌ మెమోరియల్‌ సౌత్‌ ఇండియా ఫుట్‌ బాల్‌ టోర్నమెంటు మంగళవారం ప్రారంభమైంది. ఈ పోటీలను శానిటోరియం చర్చి పాస్టర్‌ అబ్రహంబాబు ప్రారంభించారు. మొదటి రోజు బీటీ కాలేజీ జట్టు, డీజే వారియర్స్‌ (కేరళ) జట్టుపై విజయం సాధించారు. రెండవ మ్యాచ్‌ గోల్డెన్‌ సిటీ(చైన్నె) జట్టు నల్లమండ్లపల్లె జట్టును ఓడించి తదుపరి దశకు అర్హత సాధించింది. ఈ పోటీలు 8వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు జాంటీ, సుదర్శన్‌, న్యాషీ తెలిపారు. కార్యక్రమంలో రాజేష్‌, స్టాన్లీ, ప్రమోద్‌, పీడీ సుదాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement