
గంజాయి మొక్కలు తొలగింపు
సుండుపల్లె : గంజాయి మొక్కలను పెంపకం చేస్తున్న వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. మండల పరిధిలోని మాచిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ ఆరోగ్యపురం బిడికికి చెందిన మూడే సుబ్బరామ నాయక్ తన ఇంటి పరిసరాల్లో గంజాయి మొక్కలను పెంచుతున్నాడన్న విశ్వసనీయ సమాచారంతో తనతో పాటు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, ఎకై ్సజ్ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులు వెళ్లి మూడే సుబ్బరామనాయక్ ఇంటి పరిసరాలలో పెంచుకుంటున్న సుమారు 10 గంజాయి మొక్కలను సమూలంగా తొలగించి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన
వ్యక్తి అరెస్టు
తంబళ్లపల్లె : ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు...ఆర్టీసీ డ్రైవర్ రామచంద్రారెడ్డి విధి నిర్వహణలో ఉండగా, మండలంలోని పెండేరివారిపల్లెకు చెందిన చంద్రశేఖర్ (48) సోమవారం మధ్యాహ్నం దాడి చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ మంగళవారం నిందితుడు చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడంతో మదనపల్లె సబ్ జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక
వేంపల్లె : రాష్ట్ర స్థాయిలో జరిగే యోగా పోటీలకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికై నట్లు ఆర్కేవ్యాలీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా తెలిపారు. వేంపల్లెలో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కడప జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా పోటీల్లో విద్యార్థులు 6 బంగారు, 5 వెండి, 5 రాగి పతకాలతోపాటు 4 మెరిట్ స్థానాలు సాధించడం విశేషమన్నారు.