
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి
రాజంపేట : జిల్లా కేంద్రంగా పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటను చేయాలని రాజంపేట బార్ అసోసియేషన్ తీర్మానించింది. మంగళవారం బార్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు అధ్యక్షతన రాజంపేట కోర్టు క్లాంపెక్స్‌లోని బార్ ఆఫీసులో న్యాయవాదులు, బార్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కొండూరు శరత్‌కుమార్‌రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు మాట్లాడుతూ రాజంపేట జిల్లా చేయడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేటను జిల్లా చేస్తానని ప్రకటించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాఫర్‌బాషా, న్యాయవాదులు నాసరుద్దీన్, ఛాయాదేవి, కోసూరు సురేంద్రబాబు, కేఎంఎల్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.