
రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ‘భారతి’ విద్
కమలాపురం : రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు డీఏవీ భారతి స్కూల్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థిని పి.వైశాలి ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన రాజంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న వైశాలి అత్తుత్యమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన వివరించారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లా చేవూరులో జరిగే రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ సీనియర్ విభాగం పోటీల్లో ఆ విద్యార్థిని పాల్గొంటుందన్నారు. భారతి సిమెంట్స్ సీఎంఓ సాయి రమేష్, హెచ్‌ఆర్ గోపాల్‌రెడ్డి, ఐఆర్ అండ్ పీఆర్ చీఫ్ భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు వైశాలితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు.
ఠి