
పారిశ్రామికవేత్తల దరఖాస్తులకు అనుమతులు జారీ చేయాలి
రాయచోటి : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులను జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సింగిల్ డెస్క్ విధానం కింద గడిచిన త్రైమాసికంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి రాయితీల మంజూరు అంశాలపై సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె.కృష్ణ కిశోర్‌తోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్