
మహిళ మెడలో గొలుసు చోరీ
మదనపల్లె రూరల్ : మహిళ మెడలో గొలుసు చోరీ చేసిస ఘటనపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌న్ సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. పట్టణంలోని సొసైటీ కాలనీ రాములవారిగుడివీధిలో నివాసముంటున్న శ్రీనివాసులు భార్య సరస్వతి మంగళవారం రాత్రి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సమీపంలో నడిచి వస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి మెడలోని బంగారు గొలుసు చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. బంగారు గొలుసు విలువ రూ.1.5 లక్షల విలువ ఉంటుందని బాఽధితురాలు వన్ టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ అన్సర్‌బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వేర్వేరు ఘటనల్లో
ఐదుగురికి గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని బాలాజీ నగర్‌కు చెందిన నరేంద్రబాబు(30), భార్గవ్(31) వ్యక్తిగత పనులపై గుర్రంకొండకు వెళ్లి బుధవారం తిరిగి మదనపల్లెకు వస్తున్నారు. తట్టివారిపల్లె సమీపంలోని చెరువుకట్టపై కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగా గుర్రంకొండ మండలం ఉసిరికాయలపల్లెకు చెందిన పద్మావతమ్మ, మరోవ్యక్తితో కలిసి బైక్‌పై వస్తున్నారు. గ్రామ సమీపంలో ఆటో ఎదురుగా రావడంతో ద్విచక్రవాహనాన్ని అదుపుచేయలేక కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లె పంచాయతీ ఎం.కల్నాడు గ్రామానికి చెందిన బి.చంద్రశేఖర్(34) అతడి బంధువు కన్నప్ప(42) కలిసి ద్విచక్రవాహనంలో డప్పువాయిద్యాలు తీసుకుని మదనపల్లెకు వస్తున్నారు. మార్గమధ్యంలోని పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద వాహనం అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
సీసీ దారి నిర్మాణానికి
భూమి పూజ
రాయచోటి టౌన్ : పట్టణంలోని వివిధ ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు రాష్ట్ర రవాణా, క్రీడల, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. మున్సిపాల్టీ పరిధిలో రూ.3.50 కోట్లతో 36 పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం మాండవ్య నది మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షలు నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాయచోటి మున్సిపాల్టీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, పాల్గొన్నారు.
జీవ శాస్త్రంపై
అంతర్జాతీయ సదస్సు
కడప ఎడ్యుకేషన్ : కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో సమగ్ర జీవశాస్త్రం మరియు ఔషధ శాస్త్రంపై గురువారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రిన్సిపల్ డాక్టర్ జి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ జీవశాస్త్రంతో కలిగే ప్రయోజనాలను తెలిపారు. అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ తులసి మానవుల్లో వచ్చే వ్యాధులకు చికిత్స, డాక్టర్ రాజేష్ కుమార్ ఈ వ్యర్థాల నిర్వహణ, డాక్టర్ భూపేష్ ఆధునిక జీవశాస్త్రం అభివృద్ధిపై, డాక్టర్ సంజయ్ గర్భాశయ క్యాన్సర్‌పై వివరించారు. వీరనాగేంద్రకుమార్, రమేష్, పి.రవిశేఖర్, నీలయ్య, నాగేశ్వరరెడ్డి, జమాల్‌బాషా, రామచంద్ర, మహేష్, పి.నవనీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

మహిళ మెడలో గొలుసు చోరీ

మహిళ మెడలో గొలుసు చోరీ