
● కథావనంలో భారతి
ఎండపల్లి భారతి నిమ్మనపల్లె మండలం దిగువబురుజు. ఆవులు, సేద్యం, అక్షరం ఇది ప్రతి రోజూ దినచర్య. పేపర్, పెన్ను ఆమె కొంగులతో ముడిపడి ఉంటాయి. ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు పేపర్ తీసి రాస్తారు. తాను చూసింది, వినింది, అనుభవించిందే రాస్తారు. భవిష్యత్తు తరాలకు గ్రామీణ జీవనం, పల్లెయాస, మాండలికం బతికిబట్ట కట్టాలనేది ఆమె తాపత్రయం. ఆమె రాసిన ఎడారి బతుకులు, బతుకీత, జాలారిపూలు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఆమె 2018లో గిడుగు రామమూర్తి పురస్కారం, 2019 లో చంద్రశేఖర్ సాహితీ పురస్కారం, 2020లో గార్లపాటి పురస్కారం, 2022లో విమలాశాంతి పురస్కారాలు అందుకున్నారు. 29న రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో హంస పురస్కారం అందుకోనున్నారు.