
● గజల్స్‌లో దిట్ట అంజలి
మదనపల్లె పట్టణం రెడ్డీస్ కాలనీలో నివాసమున్న అంజలి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమెకు కవితలు, గజల్స్, రుబాయిలు, పద్యాలు రాయడం అలవాటు. ఇప్పటివరకూ 40 గజల్స్ రాశారు. ప్రత్యేకించి రుబాయిలు (ప్రశ్నించడం) రాయడం ఆమె ప్రత్యేకత. కత్తులు కదం తొక్కిన రోషమెక్కడ? దిక్కులన్నీ ఒక్కటైన రోషమెక్కడ? నెత్తుటి కుతకుతలేమాయో అంజలి? అంటూ తన రుబాయిల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. చైతన్యవంతమైన సమాజం కోరి రచనలు చేయడం ఈమె అభిమతం. అణగారిన, బడుగు, బలహీన వర్గాలు, అమాయక ఆడపిల్లల పట్ల చూపుతున్న వివక్ష పట్ల గళమెత్తే అక్షరమై ఆ కలం వెలుగొందుతుందని అంజలి అంటున్నారు. ఈమె రచనలకు పలు పురస్కారాలు లభించాయి.