
లారీ ఢీకొని ప్రైవేటు ఉద్యోగి దుర్మరణం
మదనపల్లె రూరల్ : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ప్రైవేటు ఉద్యోగి దుర్మరణం చెందిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. తెలంగాణా రాష్ట్రం గద్వాలకు చెందిన జాన్ (30) వాల్మీకిపురంలో ఉంటూ టెలికాం కేబుల్ పనులు చేస్తున్నాడు. గురువారం రాత్రి వాల్మీకిపురం నుంచి మదనపల్లె వస్తుండగా మార్గమధ్యంలో కాశీరావుపేట వద్ద లారీ వేగంగా వచ్చి ఢీకొంది. తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
మదనపల్లె రూరల్ : మిద్దైపె నుంచి ప్రమాదవశాత్తూ జారిపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. కోళ్లబైలు పంచాయతీ డీవీ.జగన్ కాలనీకి చెందిన రామకృష్ణ భార్య గంగాదేవి(53) ఈ నెల 23న మిద్దైపె నుంచి కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడి తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబ సభ్యులు భాదితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు.
గాయపడిన వ్యక్తి..
కలకడ : లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందినట్లు ఎస్‌ఐ బి.రామాంజనేయులు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. కలకడ మండలం గొళ్లపల్లెకు చెందిన కోట ఆచారి(80) సంతలో కూరగాయలు కొని రోడ్డు దాడుతున్న సమయంలో ఐచర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రుడు కోట ఆచారిని 108లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినటు్‌ల్ ఎస్‌ఐ తెలిపారు.
కడప అర్బన్: కడప నగరంలోని బాలాజీ నగర్ వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి సుమన్‌తేజ(19) మృతి చెందారు. కడప తాలూకా ఎస్‌ఐ తులసీ నాగ ప్రసాద్‌కు యువకుడి తల్లిదండ్రులు ఆనందరావు, అరుణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సుమతేజ తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతడు ఇంటర్ వరకు చదువుకుని కేటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 27న రాత్రి వినాయకచవితి పండుగ సందర్భంగా తనతోపాటు కేటరింగ్ పనులను నిర్వహించే స్నేహితుడు పిలవడంతో బాలాజీనగర్‌కు వెళ్లాడు. మండపం వద్ద తాను వర్షానికి తడిసిపోవడంతోపాటు, సంఘటనా స్థలంలో బాగా తడిచేరింది. ఈ క్రమంలో సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు సుమన్‌తేజ ప్రయత్నించారు. ఆ సమయంలోనే విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ..
జమ్మలమడుగు రూరల్ : మండలంలోని మోరగుడి గ్రామానికి చెందిన పల్లా రాజేశ్వరి(70) బుధవారం రాత్రి వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ఇంటికి వెళ్తున్నారు. రచ్చబండ సమీపానికి చేరగానే జమ్మలమడుగు నుంచి మైలవరం వైపు వెళ్తున్న కారు ఢీకొంది. డాక్టర్లు మృతి చెందినట్లు తెలిపారు.

లారీ ఢీకొని ప్రైవేటు ఉద్యోగి దుర్మరణం

లారీ ఢీకొని ప్రైవేటు ఉద్యోగి దుర్మరణం