
ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం తగదు
పీలేరు : ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్య ధోరణి తగదని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబిర్, కోశాధికారి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పీలేరులో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. పీఆర్‌సీ అమలు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి పాతన పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవాధ్యక్షుడు రాధాకృష్ణ, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు చెంగల్‌రాయుడు, ఆదినారాయణ, వెంకటరమణ, విజయ్‌కుమార్, పీరయ్య, చిన్నరెడ్డెప్ప, సుబ్రమణ్యం పాల్గొన్నారు.