
ఆగని భూ కబ్జాలు !
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వేకోడూరు నియోజకవర్గంలో భూ ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక్కడి ద్వితీయ శ్రేణి నాయకులు అగ్రనాయకుల అండదండలతో కొన్ని భూములను అడ్డదారిలో ఆక్రమించి కబ్జా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని స్వాహా చేసి విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కూటమి నేతల కన్ను పడితే కబ్జా కావాల్సిందే అన్న చందంగా వీరి హవా నడుస్తోంది. కూటమిలో వర్గపోరు ఉన్నప్పటికీ ఇలాంటి ఆక్రమణల విషయంలో అంతా కలిసిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాఘవరాజపురం సబ్‌స్టేషన్ వద్ద ఆర్‌అండ్‌బీ స్థలం, మైసూరావారిపల్లి ఈద్గా భూమి తంతంగం మరువక ముందే మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతీలో భూములపై వీరి కన్ను పడింది. రెడ్డివారిపల్లి పరిధిలో 2001 సంవత్సరంలో బయనపల్లి గ్రామానికి చెందిన కస్తూరి వెంకటయ్య అనే వ్యక్తి 557 సర్వే నంబర్‌లో తన 1.57 ఎకరాల భూమిలో కాళహస్తి నారాయణమ్మకు 30.05 సెంట్ల భూమిని డాక్యుమెంట్ 1698– 2001లో విక్రయించి పుల్లంపేటలో రిజిస్టర్ చేశారు. కొత్తగా రెడ్డివారిపల్లికి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండడంతో కొందరి కన్ను దీనిపై పడింది. అక్రమ అగ్రిమెంట్లతో రెండు నెలల క్రితం రిజిస్టర్ అయినట్లు తెలుపుతూ అధికారులతో కుమ్మకై ్క భూమిని చదును చేసి మరలా చేతులు మార్చి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
తప్పుడు రిజిస్ట్రేషన్‌తో
భూమి ఆక్రమణకు యత్నం