
అంగన్‌వాడీలను మోసగిస్తున్న కూటమి ప్రభుత్వం
రాజంపేట రూరల్ : అంగన్‌వాడీలను కూటమి ప్రభుత్వం అడుగడుగునా మోసగిస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ విమర్శించారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద బ్లాక్ డే సందర్భంగా గురువారం సీఐటీయూ ఆద్వర్యంలో అంగనవాడీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రూ.26వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలన్నారు. సీఐటీయూ ఉపాధ్యక్షుడు చిట్వేలి రవికుమార్, అంగన్‌వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం.విజయమ్మ, సెక్టార్ లీడర్లు ఎం.శివజ్యోత్స్న, లక్ష్మిదేవి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.